ETV Bharat / state

'8 రోజుల్లో రైతు వేదికల నిర్మాణం ప్రారంభించాలి'

author img

By

Published : Jul 23, 2020, 5:17 PM IST

కామారెడ్డి జిల్లాలోని క్యాసంపల్లి, శాబ్దిపూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్, వైకుంఠధామం పనులను పరిశీలించారు.

'8 రోజుల్లో రైతు నిర్మాణ వేదికల నిర్మాణం ప్రారంభించాలి'

హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు ట్రీగార్డులను సక్రమంగా ఏర్పాటు చేయాలని హెచ్చరించారు. క్యాసంపల్లి గ్రామంలో రైతు వేదిక నిర్మాణం ఆలస్యం జరుగుతుండటం వల్ల గుత్తేదారుకు ఫోన్ చేసి 8 రోజుల్లో పూర్తి పనులు మొదలు పెట్టాలని సూచించారు.

కలెక్టర్ ఆగ్రహం...

అనంతరం శాబ్దిపూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ కోసం ఇంతవరకు స్థలాన్ని సేకరించికపోవడంపై కలెక్టర్ ఆగ్రహించారు. మరోసారి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. స్థలాన్ని కచ్చితంగా సేకరించి వాటిలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం వాటి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

ఇవీ చూడండి : నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.