ETV Bharat / state

'ఆస్తుల నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి'

author img

By

Published : Sep 30, 2020, 1:23 PM IST

జిల్లాలోని గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటికీ సర్వే మొదలుపెట్టారు. ఇళ్ల యజమానులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను, అధార్‌ నంబర్లను సేకరిస్తున్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను జనగామలోని ఎంపీడీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్ మంగళవారం పరిశీలించారు.

the asset registration process utilize the people in jangaon
'ఆస్తుల నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి'

జిల్లాలోని గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటికీ సర్వే ప్రారంభించారు. ఇళ్ల యజమానులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను, అధార్‌ నంబర్లను సేకరిస్తున్నారు. అనుమతి లేని ఇళ్లకు అసెస్‌మెంట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు అనుమతి ఉన్న ఇళ్లు ఎన్ని, అనుమతి లేనివి ఎన్ని అనే లెక్క తేలుస్తున్నారు. మంగళవారం ఆయా గ్రామాల్లో చేపట్టిన ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను జనగామలోని ఎంపీడీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ పరిశీలించారు.

గ్రామాల్లో జీపీ పాలకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని ఆయన సూచించారు. అందుకు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, గ్రామ కోఆప్షన్‌ సభ్యులు, మహిళా సంఘం సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. ఇళ్ల యజమానుల ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌ తీసుకుని, ఇల్లు రకం వివరాలను సేకరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆస్తుల నమోదు ప్రక్రియను అందరూ సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి : మూడో ఏడాదీ మొదటిస్థానం రావడంపై కేటీఆర్ హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.