ఏపీలోని విశాఖలో వైకాపా, తెలుగుదేశం మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. ఆరిలోవలో ఓ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. ఆయనపై రాళ్ల వర్షం కరిపించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం 13వ వార్డు వెళ్లిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆయనతో వచ్చిన అనుచరులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వైకాపా వర్గీయుల దుశ్చర్యలు పెచ్చుమీరుతున్నాయని ఎమ్మెల్యే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ దాడులకు నిరసనగా ఆయన ఆరిలోవలోనే రోడ్డుపై బైఠాయించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: బండి సంజయ్