ETV Bharat / state

మౌనిక ఆత్మహత్య వెనక ఏం జరిగిందో తెలుసా..?

author img

By

Published : Dec 20, 2019, 8:54 PM IST

Updated : Dec 20, 2019, 9:57 PM IST

గత కొన్ని రోజుల క్రితం హుస్సేన్​ సాగర్​లో శవమై తేలిన మౌనిక కేసు మలుపు తిరిగింది. ఇప్పటివరకూ కొంతమంది ఆమెపై అత్యాచారం చేసి చంపేసినట్లు భావించినా పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. మౌనిక ఆత్మహత్యకు కారణం ఆమె కుటుంబసభ్యులని స్పష్టం చేశారు.

మౌనిక మృతికి కుటుంబ సభ్యులే కారణం: పోలీసులు
మౌనిక మృతికి కుటుంబ సభ్యులే కారణం: పోలీసులు

మౌనిక మృతికి కుటుంబ సభ్యులే కారణం: పోలీసులు
గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్​ హుస్సేన్​ సాగర్​లో శవమై తేలిన మౌనిక కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ సభ్యుల వల్ల మానసిక, శారీరక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడినట్లు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ స్పష్టం చేశారు. మొదటగా ఇతర బస్తీకి చెందిన వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి చంపేసినట్లు పోలీసులు భావించినా.. అందులో వారి పాత్ర లేదని తేలింది.

బావలు, సోదరులే కారణం..

పోలీసుల విచారణలో వారి కుటుంబ సభ్యులైన ఇద్దరు మౌనిక బావలు, ఇద్దరు సోదరులు ఆమె మృతికి కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. ఓల్డ్ బోయిన్​పల్లికి చెందిన మౌనిక బావలు సోమశేఖర్ (కేబుల్స్ టెక్నీషియన్), ఆంటోనీ(డ్రైవర్)లు అదే విధంగా ఆమె సోదరులు శివ కుమార్, సాయికుమార్ వృత్తిరీత్యా కూరగాయలు విక్రయిస్తారని తెలిపారు. వీళ్ళంతా కలిసి మానసికంగా, శారీరకంగా వేధించారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

సెల్​ఫోన్​ ఆధారంగా..

ఆమె చనిపోయేముందు తన స్నేహితులకు ఫోన్ చేసి.. తన బావలు, అన్నలు వేధించడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె బాధతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మౌనిక సెల్ ఫోన్ రికార్డింగ్ ఆధారంగా నలుగురిని రిమాండ్​కు తరలించారు. మౌనిక మారేడుపల్లిలోని ఓ కళాశాలలో ఎమ్మెల్టీ కోర్స్ చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాకపోవడం వల్ల బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి నుంచి అదృశ్యమైన రోజు హుస్సేన్​ సాగర్​లో దూకి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. డిసెంబర్ 9న ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దేహాన్ని అప్పజెప్పిన పోలీసులు కేసులో నిర్లక్ష్యం వహించారని తీవ్ర ఆగ్రహానికి లోనై.. తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు.

ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..కుటుంబ సభ్యుల మనో, శారీరక వేదనకు గురై మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని గోపాలపురం ఏసిపి వెంకటరమణ స్పష్టం చేశారు..గత కొన్ని రోజుల క్రితం హుస్సేన్సాగర్లో శవమై తేలిన మౌనిక కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు..మొదటగా ఇతర బస్తీకి చెందిన వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి చంపేసినట్లు పోలీసులు భావించినప్పటికీ అందులో వారి పాత్ర లేదని తేలింది..పోలీసుల విచారణలో వారి కుటుంబ సభ్యులు అయినా మౌనిక ఇద్దరూ బావలు,ఇద్దరు అన్నలు మృతికి కారణఅయ్యారని తెలిపారు..ఓల్డ్ బోయిన్పల్లి కు చెందిన మౌనిక బావలు సోమశేఖర్(కేబుల్స్ టెక్నీషియన్),ఆంటోనీ(డ్రైవర్) లు అదే విధంగా ఆమె సోదరులు శివ కుమార్ సాయికుమార్ వృత్తిరీత్యా కూరగాయలు అనుకుంటారని వీళ్ళంతా కలిసి మానసికంగా శారీరకంగా వేధించారని పోలీసుల విచారణలో వెల్లడైంది ..ఆమె చనిపోయేముందు తన స్నేహితులకు ఫోన్ చేసి తన బావలు, అన్నలు వేధించడం మూలానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె బాధతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు..ఆమె సెల్ ఫోన్ రికార్డింగ్ ఆధారంగా నలుగురు వ్యక్తులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు ..ఆమెను తీవ్రంగా మానసికంగా శారీరకంగా వేధించడం వల్లనే ఇంటి నుండి బయటకు వెళ్లి ఆ రోజే హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు..మౌనిక మారేడుపల్లి లోనే కళాశాలలో ఎమ్మెల్టి కోర్స్ చేస్తున్నట్లు తెలిపారు..కళాశాలకు వెళ్తున్నాం అని చెప్పి తిరిగి రాకపోవడంతో బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆమె ఇంటి నుండి అదృష్టమైన రోజు హుస్సేన్సాగర్లో దూకి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.అనంతరం ఆమె మృతదేహాన్ని గుర్తు తెలియని మృతదేహం కింద గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు..డిసెంబర్ 9వ తేదీన పోలీసులు గుర్తు తెలియని శవం యొక్క ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు..దేహాన్ని అప్పజెప్పిన పోలీసులు కేసులో నిర్లక్ష్యం వహించారని తీవ్ర ఆగ్రహానికి లోనైన దళిత సంఘాల తో తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా కు దిగారు..అదే విషయంలో పోలీసు ఉన్నతాధికారులు స్థానిక ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ను హెడ్ క్వార్టర్స్కు అటాక్ చేశారు.. Body:VamshiConclusion:7032401099
Last Updated : Dec 20, 2019, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.