ETV Bharat / state

లైవ్ వీడియో: ఔటర్​ రింగ్​ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

author img

By

Published : Sep 18, 2020, 4:54 AM IST

Updated : Sep 18, 2020, 12:12 PM IST

హైదరాబాద్​తో పాటు శివారు ప్రాంతాల్లో రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఔటర్​ రింగ్​ రోడ్డు (ఓఆర్​ఆర్​)పై కొన్ని చోట్ల ఉన్న కొండ చరియలు విరిగిపడ్డాయి.

ఔటర్​ రింగ్​ రోడ్డు విరిగిపడ్డ కొండచరియలు
ఔటర్​ రింగ్​ రోడ్డు విరిగిపడ్డ కొండచరియలు

లైవ్ వీడియో: ఔటర్​ రింగ్​ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

హైదరాబాద్​తో పాటు శివారు ప్రాంతాల్లో రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఔటర్​ రింగ్​ రోడ్డు (ఓఆర్​ఆర్​)పై కొన్ని చోట్ల ఉన్న కొండ చరియలు విరిగిపడ్డాయి. గురువారం రాత్రి నుంచి ఏకదాటిగా కురిసిన వర్షం వల్ల గురువారం సాయంత్రం ఓఆర్​ఆర్​ రాజేంద్రనగర్​ ఎగ్జిట్​–16 సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.

విషయం తెలిసిన వెంటనే హెచ్​ఎండీఏ, హెచ్​జీసీఎల్, ఓఆర్​ఆర్​ అధికారులు హుటా హుటిన ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్​ను మల్లించారు. పరిస్థితులను చక్కదిద్దారు. ఓఆర్​ఆర్​ నిర్మాణంలో భాగంగా ఎత్తైన కొండలు, గుట్టల మధ్య నుంచి రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్న ప్రాంతంలోనే కొండ చరియలు విరిగిపడ్డాయి.

ఇదీ చూడండి: ఇంకా మూడేళ్ల సమయం ఉంది: బండి సంజయ్‌

Last Updated : Sep 18, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.