ETV Bharat / state

ఔటర్​రింగ్ రోడ్​పై కారు యాక్సిడెంట్​

author img

By

Published : Jun 5, 2020, 5:23 AM IST

కారు ఔటర్​రింగ్ రోడ్​పై వేగంగా వెళ్తుంది.. ఒక్కసారిగా అదుపుతప్పి ముందు వాహనాన్ని ఢీకొట్టింది. అంతే డ్రైవింగ్​ చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హూటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Car Accident on Outer Ring Road near gunupur
ఔటర్​రింగ్ రోడ్​పై కారు యాక్సిడెంట్​

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం సంభవించింది. మియాపూర్ నుంచి మహేశ్వరం వైపుకు... రామకృష్ణ, అతని కొడుకు భార్గవ్, స్నేహితుడు రాములు ఔటర్ రింగ్​రోడ్​ మీదుగా బయలు దేరారు. ఘట్​కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనపూర్ వద్దకు రాగానే కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనంను ఢీ కొట్టింది.

కారు నడుపుతున్న రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలనానికి చేరుకున్న పోలీసులు అతనిని హయత్​నగర్​లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు. భార్గవ్, రాములు సైతం చికిత్స పొందుతున్నారు. మృతుని సోదరుడు చక్రధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్ కేసర్ సీఐ రఘువీర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి : ఆదిలాబాద్‌లో గ్యాంగ్‌వార్‌.. పరారీలో తెరాస కౌన్సిలర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.