ETV Bharat / state

AIG Nageshwara reddy: ఝార్ఖండ్ సీఎంతో భేటీ అయిన ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వరరెడ్డి

author img

By

Published : Jun 6, 2022, 5:32 PM IST

Updated : Jun 6, 2022, 6:47 PM IST

AIG Nageshwara reddy: హైదరాబాద్​కు చెందిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ వైద్యులు డి.నాగేశ్వరరెడ్డి ఝార్ఖండ్ సీఎం హేమంత్​ సోరేన్​ను కలిశారు. రాంచీలోని కంకే రోడ్​లో ఉన్న ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. రాంచీలో గ్యాస్ట్రాలజీ అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న సెమినార్​కు హాజరయ్యేందుకు వెళ్లారు.

nageshwar reddy
జార్ఖండ్ సీఎంను కలిసిన ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వరరెడ్డి

AIG Nageshwara reddy: పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్‌ డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి ఇవాళ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాంచీలో రెండు రోజుల పాటు గ్యాస్ట్రోలజీకి సంబంధించిన సెమినార్ జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన.. రాంచీలోని కంకే రోడ్‌లోని సీఎం నివాసానికి వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి సోరెన్​తో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్​ ఏఐజీ హాస్పిటల్స్​కు డాక్టర్ నాగేశ్వర రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అరుణ్‌కుమార్‌ సింగ్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి వినయ్‌కుమార్‌ చౌబే, ఏఐజీ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్‌ మోహన్‌ రాంచందానీ పాల్గొన్నారు.

ఇవీ చదవండి: Imprisonment to Police: ఆ కేసులో నలుగురు పోలీసు అధికారులకు జైలుశిక్ష

రూ.76వేల కోట్లతో ఆయుధాలు కొనుగోలు.. భారత్​ ఇక సూపర్​ స్ట్రాంగ్!

Last Updated : Jun 6, 2022, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.