ETV Bharat / state

windmill power: గాలి ద్వారానే ఇంటికి కావాల్సిన కరెంట్​ ఉత్పత్తి..!

author img

By

Published : Nov 21, 2021, 7:38 PM IST

ఆధునిక జీవిన విధానంలో ప్రతి పనికి విద్యుత్‌పైనే ఆధారాపడుతుంటాం. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ... విద్యుత్‌ అవసరం అదేస్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలో కరెంటు 'ఉత్పత్తి- వినియోగం' మధ్య వ్యత్యాసం రోజురోజుకు ఎక్కువవుతోంది. దీంతో సహజ వనరులు కళ్లముందే కరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే సౌరవిద్యుత్‌ విస్తృతంగా వినియోగంలోకి రాగా... తాజాగా పవన విద్యుత్‌ వైపు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇళ్లపైనే విండ్‌ పవర్‌ను తయారు చేసుకునేలా హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ప్రత్యేక టర్బైన్‌లను (wind mill power) రూపొందించింది.

windmill
windmill

విద్యుత్​ ఉత్పత్తిలో నూతన ఒరవడి.. గాలి ద్వారానే ఇంటికి కావాల్సిన కరెంట్​ ఉత్పత్తి..!

దేశ శక్తి అవసరాలు దాదాపుగా సంప్రదాయ వనరులపైనే ఆధారపడి ఉన్నాయి. బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గడం, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ కారణాలు అడ్డురావడం లాంటి కారణాలతో సంప్రదాయ శక్తి వనరులను దీర్ఘకాలం వినియోగించటం సవాలుగా మారుతోంది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ వనరుల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల పవన విద్యుత్‌(wind power) ఉత్పత్తవుతోంది. వికారాబాద్ అనంతగిరి హిల్స్ వంటి ప్రాంతాల్లో సుమారు వంద మెగావాట్ల వరకు ఈ రకమైన విద్యుత్‌ను పలు సంస్థలు తయారు చేస్తున్నాయి. తాజాగా... సోలార్ పవర్‌ మాదిరిగానే విండ్‌ పవర్‌ను ఇళ్లపైనే ఉత్పత్తి చేసుకునేలా ప్రత్యేక టర్బైన్లు వచ్చాయి. సౌర విద్యుత్తు ఉత్పత్తికి కావాల్సిన ఎండనే కాదు.. పవన విద్యుత్తుకు అవసరమైన మేర గాలులు అన్నిచోట్ల వీస్తుంటాయి. ప్రధానంగా నగరాల్లో భవనాలపై దీనికి అనువైన పరిస్థితులు ఉండటంతో.... ఆ దిశగా ఉత్పత్తికి ప్రత్యేక విండ్‌ టర్బైన్లను రూపొందించింది .... ఆర్కెమెడిస్‌ గ్రీన్‌ ఎనర్జీస్‌ సంస్థ(wind mill power).

ఇంటికి కావాల్సిన దానిలో సగం వరకు గాలితోనే..

తక్కువ స్థలంలో ఈ విండ్‌ టర్బైన్లను ఏర్పాటు చేసుకునేలా... ఆర్కెమెడిస్‌ సంస్థ రూపొందించింది. ఏడాదంతా వీచే సగటు గాలి వేగంతో ఒక కిలోవాట్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. రోజువారి ఇంటికి అవసరమైన కరెంట్‌ వినియోగంలో సగం వరకు గాలి ద్వారానే ఉత్పత్తి చేసుకోవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్‌లో దీనిని తయారు చేస్తున్నారు.

గాలి ఎటువీస్తే అటు తిరుగుతుంది

వృత్తాకార బ్లేడ్లను కలిగి ఉన్న ఈ కొత్త రకం విండ్‌ టర్బైన్‌కు... ఒకదానికొకటి చుట్టి, ఆపై విస్తరించిన మాదిరిగా రెక్కలు అమర్చబడి ఉంటాయి. సముద్రపు ఒడ్డున కన్పించే పొడుగు పెంకుల మాదిరిగా శంఖాకారంలో ఈ టర్బైన్‌ ఉంటుంది. ప్రత్యేక డిజైన్‌ కారణంగా గాలి టర్బైన్‌లోకి లాగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని తయారీసంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సెకనుకు 0.9 నుంచి 14 మీటర్ల తక్కువ వేగంతో వీచే గాలుల నుంచి సైతం ఇది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని వివరిస్తున్నారు. 360 డిగ్రీలు తిరుగుతున్నందున గాలి వీచే దిశను బట్టి దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. సెకనుకు 22 మీటర్ల అధిక గాలులను సైతం టర్బైన్‌ తట్టుకుని నిలబడేలా దీనిని రూపొందించారు.

ఆర్కెమెడిస్‌ విండ్​ టర్బైన్​ అనేది అతి తక్కువ గాలి తీసుకుని దాని నుంచి విద్యుత్​ ఉత్పత్తి చేస్తుంది. పెద్ద విండ్​ టర్బైల్​ పెడితే దానికి స్టాండ్​ ఏర్పాటు చేసి ఎత్తులో పెట్టాల్సి ఉంటుంది. కానీ... దీని విషయంలో ఏమింటంటే మన భవనాలనే వాడుకునేలా.. రూఫ్​ టాప్​ అనే కాన్సెఫ్ట్​తో దీనిని రూపొందించాము. పునరుత్పాదక విద్యుత్​ అనేది ప్రతిరోజు ఎంత ఉత్పత్తి అవుతుందనేది చూడరు. దానిని సంవత్సారానికి సగటున తీసుకుంటాము. సోలార్​ విద్యుత్​ అనేది రోజు మూడు నాలుగు యూనిట్లు ఇస్తుందని చెబుతున్నారో దానిని కూడా సంవత్సరానికి సగటున లెక్కించి చెబుతున్నారు. విండ్​ ఎనర్జీ అనేది సోలార్​ కంటే కూడా కచ్చితంగా ఎక్కువనే ఉంటుంది. - సూర్యప్రకాశ్​, ఆర్కెమెడిస్​ రూఫ్​టాప్​ విండ్​ టర్బెన్​ సీఈవో

ఎక్కడైనా అమర్చుకోవచ్చు

ఈ విండ్‌ మిల్‌లు 2 రకాల్లో అందుబాటులో ఉండగా... 36కిలోల బరువున్న చిన్న మిల్‌ నుంచి నుంచి 500 వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రెండోది 112 కిలోల పరిమాణంలో ఉండగా... దీని నుంచి 1కిలోవాట్‌ విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఎక్కువ యూనిట్ల ఏర్పాటుతో ఇంటి అవసరాలకు పోనూ... మిగిలిన కరెంటును నెట్‌మీటర్‌ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. 6 రకాల రంగుల్లో ఉన్న విండ్‌ మిల్లులను తమ భవనాలకు తగ్గట్లుగా ఎంపిక చేసుకునే అవకాశముంది. ఇల్లు, అపార్ట్‌మెంట్‌, పొలాల్లో ఎక్కడైనా దీనిని అమర్చుకోవచ్చునని.... తక్కువ శబ్దంతో పాటు ప్రకృతికి ఎలాంటి హానిచేయకుండా దీనిని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

రోబోయే రోజుల్లో దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్​ పరిమాణం ఇంతే ఉంటుంది. కాకపోతే మిగిలిన విద్యుత్​ను గ్రిడ్​కు ఇవ్వాలా..? బ్యాటరీ స్టోరేజ్​కు ఇవ్వాలా అనేది చర్చలు జరుగుతున్నాయి. మా పరికరంలో హైబ్రిడ్​ చార్జ్​ కంట్రోలర్​ అనేది రూపొందించాము. ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి చార్జ్​ కంట్రోలర్​. దీని ద్వారా ఏమిటంటే విండ్​ను సోలార్​ను, డీజీసెట్​ను, బ్యాటరీని అన్నింటినీ ఒకే దానిలో ఇంట్రిగ్రేడ్​ చేసుకుని గ్రిడ్​కు పవర్​ ఇచ్చుకోవచ్చు. ఇంట్లో విద్యుత్​ లేని సమయంలో దీనిని ఉపయోగించుకోవచ్చు. - సూర్యప్రకాశ్​, ఆర్కెమెడిస్​ రూఫ్​టాప్​ విండ్​ టర్బెన్​ సీఈవో

ప్రభుత్వం రాయితీ అందిస్తే..

విద్యుత్‌కు పెరుగుతున్న డిమాండ్, బొగ్గు కొరత, కాలుష్యం కారణంగా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్న క్రమంలో... పవన విద్యుత్‌లో ఈ సరికొత్త ఆవిష్కరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోలార్‌ కంటే ఈ విండ్‌ మిల్‌ల ధర ఎక్కువగా ఉండే అవకాశమున్నందున... ప్రభుత్వం రాయితీలపై అందిస్తే సామాన్యులు సైతం వీటిపట్ల ఆసక్తి కనబరుస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: new postmortem rules in telangana: పోస్టుమార్టంపై కొత్త మార్గదర్శకాలు.. ఇకపై రాత్రి వేళల్లోనూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.