ETV Bharat / sports

1700 పరుగులు, 4సెంచరీలు- కానీ రోహిత్​కు 2023 కలిసిరాలేదట!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 1:08 PM IST

Rohit Sharma 2023 Stats : అప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఓటమి, ఐపీఎల్​ క్వాలిఫయిర్​లో ఔట్, ఇప్పుడు వన్డేవరల్డ్ కప్​ ఓటమి, ముంబయి కెప్టెన్సీ నుంచి తప్పించడం.. ఇలా టీమ్​ఇండియా సారథి రోహిత్​ శర్మకు 2023 కలిసి రాలేదని ఫ్యాన్స్​ చెబుతున్నారు. అందుకు కారణాలు కూడా వివరిస్తున్నారు.

Rohit Sharma 2023 Stats
Rohit Sharma 2023 Stats

Rohit Sharma 2023 Stats : మరో 14రోజుల్లో 2023 ముగియనుంది. టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మకు మాత్రం ఈఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు! ఒక కెప్టెన్​గా రోహిత్ శర్మ‌కు కలిసొచ్చిన అంశం ఒక్కటి లేదు. వ్యక్తిగతంగా కాస్త మెరుగైన ప్రదర్శనే చేసినా కెప్టెన్‌గా మాత్రం విజయాలను అందుకోలేకపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి, ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోవడం వంటి ఘటనలతో రోహిత్ శర్మ మానసిక వేదనకు గురయ్యాడు.

ఫిబ్రవరిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ సిరీస్​ను గెలుచుకుని ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు రోహిత్​. ఆ తర్వాత ఐపీఎల్​లో ప్లే ఆఫ్స్​కు ముంబయి ఇండియన్స్​ జట్టను చేర్చాడు. కానీ క్వాలిఫయిర్​లోనే వెనుదిరిగి టైటిల్ అందించలేకపోయాడు.

ఐపీఎల్​ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఓటమిపాలై త్రుటిలో ఐసీసీ టైటిల్ చేజార్చుకున్నాడు. అనంతరం వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్‌పై మాత్రమే ఫోకస్ పెట్టాడు రోహిత్ శర్మ. టీ20లకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత్‌ను జట్టును విజేతగా నిలబెట్టాడు. కొత్త ఆశలు రేకెత్తించాడు.

ఇటీవలే భారత్​లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ వరుస విజయాలతో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్​లో టీమ్​ఇండియా ఓటమి పాలవ్వడంతో ఒక్కసారిగా ఏడ్చేశాడు. అసాధారణ ప్రదర్శనతో వరుసగా 10 విజయాలు సాధించిన ఫైనల్ చేరిన టీమ్​ఇండియాను దురదృష్టం వెంటాడింది. పిచ్ కండిషన్స్ పూర్తిగా ఆసీస్‌కు అనుకూలంగా మారడంతో రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది.

వన్డే వరల్డ్ కప్​ ఓటమి తర్వాత ఆటకు దూరంగా ఉన్న రోహిత్​ సౌతాఫ్రికాతో ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్‌ల సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కానీ ఇంతలోనే రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతలను తొలగిస్తూ ప్రకటన వచ్చింది. హార్దిక్ పాండ్యను నూతన సారథిగా ముంబయి ఇండియన్స్ ప్రకటించింది. దీంతో రోహిత్ ఫ్యాన్స్ అంతా 2023 తమకు కలిసి రాలేదని చెబుతున్నారు.

అయితే రోహిత్ మాత్రం వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరంగా ఉన్న రోహిత్ శర్మ వన్డే, టెస్ట్‌ల్లో కలిసి 37 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 51.28 సగటుతో 1795 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలతో పాటు 11 హాఫ్ సెంచరీలున్నాయి. 2019 తర్వాత ఆ స్థాయిలో రోహిత్ శర్మ ఈ ఏడాదే బ్యాటింగ్ చేశాడు.

రోహిత్‌ కెప్టెన్సీని MI అసలెలా వదులుకుంది? కోహ్లీ 'కామెంట్స్'​ గుర్తున్నాయా?

రోహిత్​ కోసం దిల్లీ ప్రయత్నాలు- రూ.కోట్ల ఆఫర్​- మరి డీల్ ఏమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.