ETV Bharat / sports

లేటు వయసులో రీ ఎంట్రీకి సీనియర్​ ప్లేయర్​ రెడీ​.. ఏకంగా కోహ్లీ స్థానంలోనే!

author img

By

Published : Jun 26, 2023, 3:45 PM IST

Updated : Jun 26, 2023, 4:33 PM IST

kedar jadhav stats 2023 : టీమ్​ఇండియా సీనియర్​ క్రికెటర్​ కేదార్‌ జాదవ్‌.. టీమ్​ఇండియా రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..

Etv Bharat
Etv Bharat

kedar jadhav stats 2023 : టీమ్​ఇండియా సీనియర్​ క్రికెటర్​ కేదార్‌ జాదవ్‌.. దాదాపు మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 38 ఏళ్లు. మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తన కెరీర్‌ ఆరంభంలో పర్వాలేదనిపించే ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత తన పేలవ ప్రదర్శనతో టీమ్​కు దూరమయ్యాడు.

అయితే తన ఆటతో పాటే ధోనీకి ఆప్తమిత్రుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జాదవ్‌. ప్రస్తుతం అతడు దేశీవాళీ క్రికెట్‌లో మంచిగా రాణిస్తున్నాడు. అద్భుత ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. రంజీ సీజన్‌లో 2022-23లో అతడు తన ఆటతీరుతో అదరగొట్టాడు. 5 ఇన్నింగ్స్‌లలో 110.6 యావరేజ్​తో 553 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఓ డబుల్‌ సెంచరీ, ఓ శతకం ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.

kedar jadhav stats ranji trophy 2023 : ప్రస్తుతం.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కోలాపూర్ టస్కర్స్‌కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. టీమ్​ఇండియా రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అందుకు తగ్గట్టు కష్టపడతున్నాని చెప్పుకొచ్చాడు.

"ప్రస్తుతం నా ఆటతీరు పట్ల ఎంతో ఆనందంగా ఉన్నాను. నిలకడగా రాణిస్తూ శ్రమిస్తే.. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. నేను ఆడే ప్రతి టోర్నీలో మంచి ప్రదర్శన చేయడమే నా లక్ష్యం. ఆ తర్వాత సెలక్టర్లే వారి నిర్ణయం తీసుకుంటారు. నేనైతే ప్రస్తుతం మంచి ఫిట్‌గానే ఉన్నాను. వాస్తవానికి చాలామంది ఆల్‌రౌండర్లంటే చాలా తక్కువగా చూస్తారు. కానీ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు చేసే స్కిల్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడ ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్ ఫిట్‌నెస్ కూడా ఎంతో ముఖ్యం. అందుకే సెలక్టర్లు కూడా సరైన ఆల్‌రౌండర్లను వెతికి ఎంపిక చేయలేకపోతున్నారు. నేనైతే టాపర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మహారాష్ట్ర తరపున మూడో స్ధానంలో ‍బ్యాటింగ్‌ చేస్తున్నాను. ముఖ్యంగా వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మూడో స్థానమే నాకు సరైనది. ఆ స్ధానంలో బ్యాటింగ్​కు దిగితే స్వేఛ్చగా ఆడగలను" అని జాదవ్‌ అన్నాడు. అతడు చివరి సారిగా 2020లో భారత జట్టు తరపున ఆడాడు. అయితే ప్రస్తుతం టీమ్​ఇండియాలో విరాట్‌ కోహ్లీ మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు.

Kedar Jadav re entry
కేదర్ జాదవ్​

ఇదీ చూడండి :

వనిందు హసరంగ సూపర్ రికార్డ్​.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు

సాయి సుదర్శన్​ జోరు తగ్గట్లేదుగా.. వరుసగా హాఫ్​​ సెంచరీలు!

Last Updated : Jun 26, 2023, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.