ETV Bharat / sports

ఐపీఎల్: కోల్​కతా కెప్టెన్ మోర్గాన్​కు జరిమానా

author img

By

Published : Apr 22, 2021, 9:48 AM IST

చెన్నైతో మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోల్​కతా కెప్టెన్​ మోర్గాన్​కు జరిమానా పడింది. జీతంలో రూ.12 లక్షల జరిమానా విధించారు.

Eoin Morgan
మోర్గాన్

చెన్నై సూపర్ కింగ్స్​​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్ ఓటమిపాలైంది​. ఓటమితో నిరాశలో ఉన్న ఈ జట్టుపై మరో పిడుగు పడింది. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్ కారణంగా కోల్​కతా జట్టు సారథి మోర్గాన్​ జీతంలో రూ.12 లక్షలు కోత విధించారు. ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.

ముంబయి వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో 18 పరుగులు తేడాతో చెన్నై సూపర్​కింగ్స్​ గెలిచింది. 221 పరుగులే లక్ష్యంగా బరిలో దిగిన మోర్గాన్​ సేన.. 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. కోల్​కతా బ్యాట్స్​మెన్ రసెల్​(54), పాట్​ కమిన్స్​(66), దినేశ్​ కార్తిక్​ మినహా జట్టులో మిగిలిన బ్యాట్స్​మన్​ ఎవ్వరూ రాణించలేకపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.