ETV Bharat / sports

తొలి వన్డేలో టీమ్​ఇండియాకు భారీ జరిమానా

author img

By

Published : Nov 28, 2020, 3:38 PM IST

Updated : Nov 28, 2020, 3:52 PM IST

ఆసీస్​తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్​రేటు​ కారణంగా టీమ్​ఇండియాకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. మ్యాచ్​ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.

India
టీమ్​ఇండియా

టీమ్​ఇండియాకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. మ్యాచ్​ ఫీజులో ​20శాతం కోత విధించినట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 'స్లో ఓవర్​రేట్' వేయడమే ఇందుకు కారణం.

"తొలి వన్డేలో భారత జట్టు ఆటగాళ్లు తమకు కేటాయించిన సమయం కన్నా ఎక్కువ సేపు ఓవర్లు వేశారు. ఈ​ కారణంగా టీమ్​ఇండియాకు మ్యాచ్​ ఫీజులో 20శాతం కోత విధించాము. ఇందుకు సారథి కోహ్లీ కూడా అంగీకరించాడు."

-ఐసీసీ.

సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఆసీస్​ చేతిలో 67 పరుగుల తేడాతో టీమ్​ఇండియా ఓటమి పాలైంది. కంగారూ జట్టు విజయంలో ఫించ్(114), స్మిత్(105) కీలక పాత్ర పోషించారు. దీంతో మూడు వన్డేల సిరీస్​లో ఆసీస్​ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నవంబర్​ 29న ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.

ఇదీ చూడండి : తొలి వన్డే: ఆసీస్​ ఘనతలు.. భారత్​ చెత్త రికార్డులివే..

Last Updated : Nov 28, 2020, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.