ETV Bharat / sports

'మొతేరా పిచ్​పై ఏడుపు ఎందుకు?'

author img

By

Published : Feb 28, 2021, 12:43 PM IST

Updated : Feb 28, 2021, 1:02 PM IST

టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య మూడో టెస్టు నిర్వహించిన పిచ్​పై క్రికెటర్లలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. వాటిపై స్పందించిన ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్​ లియోన్​.. 'స్పిన్​ బౌలింగ్​కు పిచ్​ అనుకూలిస్తుంటే అందరూ కలిసి ఏడుస్తున్నట్లు ఉంది' అని అన్నాడు. ఇదే విషయంపై మాట్లాడిన ఇంగ్లాండ్​ బ్యాటింగ్​ కోచ్​ జొనాథన్​ ట్రాట్​.. పిచ్​ను నిందించడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

Lyon slams critics for 'crying' over Motera pitch
'మొతేరా పిచ్​పై ఏడుపు ఎందుకు?'

మొతేరా పిచ్​పై వస్తోన్న భిన్నాభిప్రాయాలపై ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్​ లియోన్​ స్పందించాడు. పిచ్​ స్పిన్​కు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో 'అందరూ ఏడుస్తున్నట్లు తెలుస్తోంది' అని వెల్లడించాడు. కానీ, జట్లు తక్కువ స్కోరుకే పరిమితం కావడంపై ఎందుకు మాట్లాడడం లేదని లియోన్​ అన్నాడు.

"అంతర్జాతీయ టెస్టు క్రికెట్​లో మా జట్టు 47, 60 పరుగులకే ఆలౌట్​ అయిన సందర్భాలున్నాయి. ఎప్పుడూ పిచ్​ను నిందించలేదు. కానీ, ఇప్పుడు స్పిన్​ బౌలింగ్​కు పిచ్​లు అనుకూలిస్తుంటే మాత్రం అందరూ ఏడుపు మొదలెట్టారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అలా మాట్లాడుతుంటే వినోదాత్మకంగా ఉంది".

- నాథన్​ లియోన్​, ఆస్ట్రేలియా స్పిన్నర్​

స్పిన్నర్లకు అనుకూలించేలా మొతేరా పిచ్​ను తయారు చేసిన క్యూరేటర్​పై నాథన్​ లియోన్​ ప్రశంసలు కురిపించాడు. ఆ క్యూరేటర్​ను తన స్వదేశానికి ఎలా తీసుకురావాలనే ఆలోచనలో తాను ఉన్నట్లు నాథన్​ లియోన్​ తెలిపాడు. ​"ఆ మ్యాచ్​ నేను చూశాను. పిచ్​ను తయారు చేసిన క్యూరేటర్​ను సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​కు ఎలా తీసుకురావాలా? అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా" అని ఆసీస్​ స్పిన్నర్​ లియోన్ అన్నాడు.

పిచ్​ను​ నిందించడం సరికాదు

డే/నైట్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ ఘోర పరాభవానికి స్పిన్‌కు అనుకూలించే వికెటే కారణమని అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ స్పందించాడు. పిచ్‌ను నిందించడం సరికాదని, అలా చేయడం తప్పని జొనాథన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరింత మంచిగా బ్యాటింగ్‌ చేసి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవన్నాడు.

అహ్మాదాబాద్​లోని మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో టీమ్​ఇండియా ఘనవిజయం సాధించింది. రెండో రోజుల్లోనే మ్యాచ్​ ఫలితాన్ని రాబట్టడంలో స్పిన్నర్లదే కీలకపాత్ర. స్పిన్​కు అనుకూలించిన పిచ్​పై ఇంగ్లాండ్​ మాజీ ఆటగాళ్లు మైఖేల్​ వాన్​, ఆండ్రూ స్ట్రాస్​ వంటి వారు మొతేరా పిచ్​పై అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: మొతేరా పిచ్​పై మాజీల భిన్నాభిప్రాయాలు

Last Updated : Feb 28, 2021, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.