ETV Bharat / sports

'ఐపీఎల్​తో ధోనీ కెరీర్​కు ఉపయోగం లేదు'

author img

By

Published : Aug 2, 2020, 6:32 PM IST

ఐపీఎల్​, ధోనీ కెరీర్​కు ఏమాత్రం ఉపయోగపడదని అన్నాడు మాజీ బౌలర్ నెహ్రా. భారత్​ తరఫున మహీ చివరి మ్యాచ్​ ఎప్పుడో ఆడేశాడని చెప్పాడు.

'ఐపీఎల్​తో ధోనీ కెరీర్​కు ఉపయోగం లేదు'
మహేంద్ర సింగ్ ధోనీ

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​.. ధోనీ పునరాగమనానికి ఏమాత్రం ఉపయోగపడదని మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. మహీ భారత్​ తరఫున చివరి మ్యాచ్​ ఆడేశాడని తెలిపాడు.

గతేడాది వన్డే ప్రపంచకప్​ సెమీస్​లో చివరగా ధోనీ మైదానంలో కనిపించాడు. అప్పటి నుంచి విరామంలోనే ఉన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్​ ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్​నకు ఎంపికవుతాడని అభిమానులు అందరూ భావించారు. కరోనా రావడం, ఐపీఎల్ వాయిదా, టీ20 ప్రపంచకప్​ రద్దుతో మహీ కెరీర్​ సందేహంలో పడింది. రిటైర్మెంట్​ తీసుకుంటాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Ashish Nehra
భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా

"ఈ ఐపీఎల్​తో ధోనీ అంతర్జాతీయ కెరీర్​కు ఉపయోగం లేదు. నాకు తెలిసినంతవరకు టీమ్​ఇండియా తరఫున అతడు చివరి మ్యాచ్​ ఆడేశాడు. మళ్లీ ఇప్పుడు ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఎల్​ లాంటి టోర్నీ మహీ సెలక్షన్​కు పనికొస్తుందని అనుకోను"

-ఆశిష్ నెహ్రా, భారత మాజీ క్రికెటర్

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్​ జరగనుంది. ఇందులో భాగంగా ఆగస్టు 9న చెన్నైకి చేరుకోనున్నాడు ధోనీ. ఇతర భారత క్రికెటర్లు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కలిసి ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరుకుంటారు.

IPL 2020
ఐపీఎల్ 2020

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.