ETV Bharat / sports

తొలి టెస్టులోనే శుభ్​మన్ గిల్ ఘనత

author img

By

Published : Dec 27, 2020, 1:20 PM IST

Updated : Dec 27, 2020, 3:36 PM IST

ఆస్ట్రేలియాతో బాక్సింగ్​ డే టెస్టులో యువ బ్యాట్స్​మన్ గిల్ రికార్డు సాధించాడు. ఆసీస్​పై టెస్టు అరంగేట్రంలోనే ఎక్కువ పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.

India vs Australia: Shubman Gill achieves unique feat with 45-run-knock on Test debut at MCG
శుభ్​మన్ గిల్​.. అరంగేట్రంలోనే అదరగొట్టాడుగా

బాక్సింగ్​ డే టెస్టుతో టెస్టు అరంగేట్రం చేసిన భారత ఆటగాడు శుభ్​మన్ గిల్ అదరగొట్టాడు. మెల్​బోర్న్​లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్​లో 45 పరుగులు చేసి కొద్దిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఘనత సాధించాడు.

ఆసీస్ జట్టుపై టెస్టు అరంగేట్రంలోనే ఎక్కువ పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఇతడి కంటే ముందు మయాంక్​ అగర్వాల్ (2018లో 76 పరుగులు), మాజీ క్రికెటర్ దత్తు ఫడ్​కర్ (51) ఉన్నారు.

రెండో టెస్టు రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్.. 277/5 పరుగులతో నిలిచింది. క్రీజులో రహానె(104*), జడేజా(40*) ఉన్నారు. ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమ్​ఇండియా. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో 195 పరుగులకు ఆలౌట్​ అయింది ఆస్ట్రేలియా.

ఇదీ చూడండి: రహానే శతకం.. ఆధిక్యంలో భారత్

Last Updated : Dec 27, 2020, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.