ETV Bharat / sitara

'డిస్నీల్యాండ్​​'కు నాలుగు నెలల తర్వాత సందర్శకులు

author img

By

Published : Jul 1, 2020, 5:11 PM IST

టోక్యో డిస్నీల్యాండ్​.. నాలుగు నెలల తర్వాత తెరుచుకుంది. అయితే సందర్శకుల ఆరోగ్యమే తమ తొలి ప్రాధాన్యమని సంస్థ నిర్వహకులు చెప్పారు.

నాలుగు నెలల తర్వాత టోక్యో డిస్నీలాండ్​ తెరుచుకుంది
టోక్యో డిస్నీలాండ్

దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత టోక్యో డిస్నీల్యాండ్ తెరుచుకుంది. అయితే 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కవ ఉన్న, ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించినా ఇక్కడికి రావొద్దని సంస్థ ప్రతినిధులు సూచించారు. దీనితో పాటే సందర్శకులకు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టోక్యో డిస్నీలాండ్​కు వచ్చిన వీక్షకులు

ఈ డిస్నీల్యాండ్​లోని ప్రఖ్యాత షోలు, కవాతుల్ని కొన్నిరోజులపాటు నిలిపివేస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. అయితే డిస్నీ పాత్రలు మాత్రం రోజులో కొన్నిసార్లు కనువిందు చేస్తూ ఉంటాయి. టికెట్లను ఆన్​లైన్​లో మాత్రమే విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ 12 గంటలు మాత్రమే 'డిస్నీల్యాండ్' పనిచేస్తుందని చెప్పారు.

సందర్శకుల ఆరోగ్యమే తమ ప్రధాన కర్తవ్యమని, వ్యక్తిగత పరిశుభ్రత, అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే అనుమతి ఇస్తామని నిర్వహకులు తెలిపారు. ఈ వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకునేలా టికెట్ కొన్నప్పటి నుంచి అన్ని విధాల వారికి సహకరిస్తామని సంస్థ ప్రకటించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.