ETV Bharat / jagte-raho

భార్యని చంపి... చాపలో చుట్టి మాయం చేద్దామనుకున్నాడు!

author img

By

Published : Jan 11, 2021, 6:14 PM IST

మద్యం తాగొద్దని వారించిన భార్యని రోకలితో కొట్టి చంపాడు ఓ భర్త. మృతదేహాన్ని చాపలో చుట్టి మాయం చేద్దామనుకున్నాడు. ఇల్లు మారుతున్నామని చెప్పి సామాన్లతో సహా పరారయ్యాడు. కానీ సీన్ రివర్స్ అయింది. చివరకు పోలీసులకు చిక్కాడు.

acp-press-meet-on-husband-murdered-his-wife-case-in-hyderabad
భార్యని చంపి... చాపలో చుట్టి మాయం చేద్దామనుకున్నాడు!

మద్యం తాగొద్దని‌ మందలించిన‌ భార్యను హతమార్చిన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీపీ సురేందర్‌ రావు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చింతోనిచిలక గ్రామానికి చెందిన వెంకటనారాయణ అలియాస్ శేఖర్ భార్యాబిడ్డలను వదిలేసి ఆయుర్వేద మూలికలు అమ్ముతూ జీవనం సాగించేవాడు. అదే జిల్లాకు చెందిన స్రవంతితో సన్నిహిత సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో శేఖర్, స్రవంతిలు గతేడాది పెళ్లి చేసుకుని అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిలో అద్దెకు ఉండేవారు. డిసెంబర్‌లో వారు హైదర్‌నగర్ కాలనీకి మకాం మార్చారు.

శేఖర్ మద్యానికి బానిసవడం వల్ల స్రవంతి వద్దని మందలించింది. ఆగ్రహించిన సురేశ్ రోకలితో స్రవంతి తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని రెండు రోజులపాటు గదిలోనే దాచిపెట్టాడు. నాలుగో రోజు ఎవరూ లేని సమయంలో మృతదేహాన్ని బయటకు తరలించేందుకు యత్నించి విఫలమయ్యాడు. మృతదేహాన్ని చాపలో చుట్టి ఇంటి మెట్ల కింద పడేసి... అమీర్‌పేట‌లో ఇల్లు తీసుకున్నామని చెప్పి సామాన్లతో సహా ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. అనంతరం కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి తిరిగిన‌‌‌‌‌ శేఖర్ సోమవారం ఉదయం ఇంటికి చేరాడు. హత్య జరిగిన నాటి నుంచి అమీర్‌పేటలో‌‌‌‌ శేఖర్‌ ఇంటి వద్ద నిఘా ఉంచిన పోలీసులు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన రోకలి, రక్తంతో తడిసిన వస్త్రాలను స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించారు.

ఇదీ చదవండి: ఆడపిల్లలు పుట్టారని.. అదనపు కట్నం కోసం వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.