ETV Bharat / international

'టిబెట్​' ముసుగులో.. సరిహద్దుల్లో డ్రాగన్ విస్తరణ

author img

By

Published : May 22, 2021, 11:19 AM IST

టిబెట్​లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో.. చైనా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. భారత్​లోని అరుణాచల్​ ప్రదేశ్​తో పాటు నేపాల్, భూటాన్ భూభాగాలకు చేరువయ్యేందుకు యత్నిస్తోంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయమై చైనా శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ విషయం స్పష్టమైంది.

China
చైనా

టిబెట్ సరిహద్దులోని మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో చైనా ఇటు భారత్​లోని అరుణాచల్​ ప్రదేశ్​.. అటు నేపాల్​, భూటాన్ భూభాగాలకు చేరువగా వస్తోంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా(85) వారసుడి ఎంపిక విషయమై చైనా శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

వ్యూహాత్మక అడుగులు

'1951 నుంచీ టిబెట్.. దాని విమోచనం, అభివృద్ధి.. శ్రేయస్సు' అంటూ దీనికి పేరు కూడా పెట్టారు. హిమాలయ ప్రాంతంలోని నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దులపై పట్టు సాధించాలంటే టిబెట్ కీలకం కావటంతో సరిహద్దు గ్రామాల అభివృద్ధి పేరిట చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాలక కమ్యూనిస్టు పార్టీ సూచనల మేరకు.. పేదరికంతో అవస్థలు పడుతున్న టిబెట్ సరిహద్దు గ్రామాల అభివృద్ధి పనులకు ఏటా నిధుల కేటాయింపులు పెంచుకొంటూ వెళతామని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. 2012లో జిన్​పింగ్ అధికారంలోకి వచ్చాక చైనా సరిహద్దుల అభివృద్ధి, కొత్త గ్రామాల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెట్టారు. విస్తృతంగా హైవేల నిర్మాణం చేపట్టి, మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారు.

దలైలామా వారసుడి ఎంపికపై తిరకాసు

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడు ఎవరైనా తమ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని, అలా కాకుండా వారి ఇష్టానుసారం ఎవరో ఒకరిని వారసుడిగా నియమిస్తే.. గుర్తించబోమని చైనా ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. 17,18 శతాబ్దాల్లో చైనాను పరిపాలించిన రాజుల కాలం నుంచి కూడా బౌద్ధ గురువుల వారసులకు పాలకుల ఆమోదం తప్పనిసరిగా ఉండేదని తెలుపుతూ చైనా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.

టిబెట్ ప్రాచీనకాలం నుంచీ చైనాలో అవిచ్ఛిన్న భాగమని అందులో స్పష్టం చేసింది. 1959లో టిబెట్ ప్రజల తిరుగుబాటును చైనా అణచివేయగా.. 14వ దలైలామాకు భారత్​ రాజకీయ ఆశ్రయమిచ్చింది. అప్పట్నుంచీ హిమాచల్ ప్రదేశ్​లోని ధర్మశాల కేంద్రంగా టిబెట్ ప్రవాస ప్రభుత్వం నడుస్తోంది. దలైలామాకు ఇప్పుడు వార్ధక్యం మీద పడటంతో గత రెండేళ్లుగా ఆయన వారసుడి చర్చ నడుస్తోంది.

ఇదీ చదవండి : మధ్యప్రదేశ్​లో తొలి వైట్ ఫంగస్ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.