ETV Bharat / international

లద్దాఖ్​ సమీపంలో చైనా కొత్త ఎయిర్​ బేస్​

author img

By

Published : Jul 19, 2021, 6:20 PM IST

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో పోరాడడంలో తనకున్న పరిమితులను అధిగమించేందుకు చైనా యత్నిస్తోంది. షింజియాంగ్‌ రాష్ట్రంలోని షాక్సేలో కొత్తగా వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా సరిహద్దుల్లో మరింత బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

China developing new fighter aircraft base near Ladakh
లద్దాఖ్​ సమీపంలో చైనా కొత్త ఎయిర్​ బేస్​

భారత్​తో సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఓవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు సరిహద్దులవైపు దూసుకొస్తోంది చైనా. భారత్​తో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి తమ యుద్ధవిమానాల ఆపరేషన్లకు అడ్డంకులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం.. తూర్పు లద్దాఖ్​కు సమీపంలో షింజియాంగ్​ రాష్ట్రంలోని షాక్సే నగరంలో యుద్ధ విమానాల ఆపరేషన్​ కోసం కొత్త వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తోంది.

" భారత సరిహద్దుల్లో యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం ఇప్పటికే ఉన్న కష్గర్​, హోగన్​ ఎయిర్​ బేస్​లకు మధ్యలో కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త ఎయిర్​ బేస్​తో చైనా వాయుసేనకు ఆ ప్రాంతంలో ఉన్న పరిమితులను అధిగమించే అవకాశం ఉంది. షాక్సే​లో ఇప్పటికే ఎయిర్​ బేస్​ ఉంది. ఫైటర్​ ఎయిర్​క్రాఫ్ట్స్​ ఆపరేషన్​ కోసం దానిని ఆధునికీకరిస్తున్నారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు సాగుతున్నట్లు కనిపిస్తోంది. "

- ప్రభుత్వ వర్గాలు.

ప్రస్తుతం చైనాలో ఉన్న యుద్ధ విమానాల ఎయిర్​ బేస్​కు, ఎల్​ఏసీకి మధ్య సుమారు 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. షాక్సే ఎయిర్​ఫీల్డ్​తో ఫైటర్ల ఆపరేషన్​ ఉన్న అడ్డంకులు తొలిగిపోనున్నాయి. .

భారత్​ అప్రమత్తం..

ఉత్తరాఖండ్​ సరిహద్దు నగరం బారహోటికి సమీపంలోని చైనా ఎయిర్​ఫీల్డ్​ను భారత్​ నిశితంగా పరిశీలిస్తోంది. ఆ ప్రాంతంలో ఇటీవల పదుల సంఖ్యలో చైనాకు చెందిన మానవరహిత విమానాలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో అప్రమత్తమైంది. కొద్ది రోజుల క్రితం హోగన్​, కష్గర్​, గార్​ గున్సా ఎయిర్​ఫీల్డ్స్​లో సైనిక ప్రదర్శనలు చేపట్టింది. అయితే.. ఎయిర్​ బేస్​ల విషయంలో భారత్​తో పోలిస్తే చైనాకు అంత బలం లేదు. ఎల్​ఏసీకి అతి సమీపంలోనే భారత్​కు వాయుసేన స్థావరాలు ఉండటం వల్ల ఫైటర్​ జెట్ల మోహరింపులో భారత్​ ముందుంది. ఈ క్రమంలోనే తన బలాన్ని పెంచుకునేందుకు ఎల్​ఏసీ సమీపంలో ఎస్​-400 ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ను మోహరించింది చైనా.

ఇదీ చూడండి: చైనా దూకుడుకు కళ్లెం వేసే 'ఈగల్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.