ETV Bharat / city

ధాన్యం సమస్య పరిష్కారానికి రెండంచెల వ్యూహమే పరిష్కారం!

author img

By

Published : Apr 5, 2022, 7:28 AM IST

Paddy Procurement In Telangana: ధాన్యం సమస్య పరిష్కారానికి రెండంచెల వ్యూహమే పరిష్కారం అవుతుందని భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి.కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని పథకం ప్రకారం ముందుకెళ్లాలన్నారు. లేదంటే రైతులు నష్టపోతారని ఆయన తెలిపారు.

bv krishna rao
bv krishna rao

Paddy Procurement In Telangana: ధాన్యం సమస్యను పరిష్కరించడానికి రెండంచెల వ్యూహాన్ని అనుసరించాల్సి ఉందని భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి.కృష్ణారావు అభిప్రాయపడ్డారు.ఇందులో ఒకటి కనీస మద్దతు ధర కంటే తక్కువ వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం రైతుకు నేరుగా చెల్లించాలన్నారు. దీనివల్ల ఎగుమతికి అవకాశం పెరుగుతుందని చెప్పారు. రెండోది మిల్లర్లకు నూకల వల్ల నష్టం వచ్చే మొత్తాన్ని భరించి ఎఫ్‌సీఐకి నిబంధనల ప్రకారం బియ్యం ఇచ్చేలా చేయడం ద్వారానే సమస్యను అధిగమించవచ్చన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని పథకం ప్రకారం ముందుకెళ్లాలన్నారు. త్వరలోనే పంట రానున్నందున ఈ విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేదంటే రైతులు నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై బి.వి.కృష్ణారావు మాట్లాడారు.

  • బియ్యం ఎగుమతికి ఉన్న అవకాశాలేమిటి? దీని ద్వారా ప్రస్తుత సమస్యను పరిష్కరించవచ్చా?

కేంద్రం బాయిల్డ్‌ బియ్యం (ఉప్పుడు బియ్యం) కొనలేమని చెప్తోంది. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో ఉప్పుడు బియ్యం కాకపోతే నూకలు ఎక్కువ వస్తాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాలు కలిసి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి. ఒకటి ఎగుమతికి ఉన్న అడ్డంకులను అధిగమించడానికి చర్యలు తీసుకోవడం. రెండోది కేంద్రానికి రా రైస్‌ నిబంధనల ప్రకారం ఎలా ఇవ్వాలో చూడటం. అంతర్జాతీయ ధర కంటే కనీస మద్దతు ధర ద్వారా రైతుకు చెల్లించేది ఎక్కువ. విదేశాల్లో టన్ను ధర 350-360 డాలర్లు. మన దగ్గర 420-430 డాలర్లు. వ్యాపారులు నేరుగా మద్దతు ధరకు కొని ఎగుమతి చేయడం సాధ్యం కాదు. ఎగుమతిదారుకు ప్రభుత్వం నేరుగా సబ్సిడీ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి రైతు నుంచి కొనే ధరకు, కనీస మద్దతు ధరకు ఉన్న గ్యాప్‌ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలో వేయాలి. అయితే తెలంగాణలో యాసంగిలో వచ్చే మొత్తం బియ్యం ఎగుమతి అసాధ్యం. ప్రస్తుత మిల్లింగ్‌ విధానంలోనే మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వాలి. నూకలుగా వచ్చే మొత్తానికి ప్రభుత్వం కొంత మొత్తం చెల్లించాలి. నూకలు మిల్లర్లు అమ్ముకోవచ్చు. నూకలకు విదేశాల్లో కూడా చాలా డిమాండ్‌ ఉంది. అక్కడ మామూలు బియ్యం కేజీ రూ.25 ఉంటే, నూకలకు రూ.21 లభిస్తోంది. తవుడు ధర రూ.40 వరకు ఉంది. మిల్లర్లు మిల్లింగ్‌ చేసి బియ్యం ఒక్కటే అమ్ముకోరు. నూకలు, తవుడు మొదలైనవాటి వల్ల కూడా ఆదాయం వస్తోంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇథనాల్‌ తయారీకి కూడా డిమాండ్‌ పెరిగింది. దీంతో పాటు తెలంగాణలో గోదాములు, ఇతర సమస్యలున్నాయి. ఎఫ్‌సీఐకి రాష్ట్రంలో గత ఏడాది రబీ(యాసంగి) బియ్యం ఇవ్వడమే ఇంకా పూర్తి కాలేదు. ఖరీఫ్‌(వానాకాలం) ఉంది. మళ్లీ రబీ ధాన్యం వచ్చింది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ మళ్లించడంలోనూ జాప్యం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ వరకు పూర్తయ్యింది. పెరుగుతోన్న వరి సాగు విస్తీర్ణానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

  • ప్రభుత్వం కొంత మొత్తం సబ్సిడీగా ఇచ్చి ధాన్యం సేకరించడం ఏ రాష్ట్రంలో ఉంది?

ఛత్తీస్‌గఢ్‌లో అమలులో ఉంది. కేంద్రం మిల్లింగ్‌ ఛార్జీల కింద క్వింటాకు రూ.పది ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.130 అదనంగా ఇస్తోంది. మిల్లర్లు నూకలు అమ్ముకొని కేంద్రానికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన బియ్యం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్‌ కింద అదనంగా చెల్లించే మొత్తం వల్ల మిల్లర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆ రాష్ట్రంలో ఖరీఫ్‌లోనే కొనుగోళ్లు ఉంటాయి.

  • ప్రభుత్వం కొంత మొత్తం సబ్సిడీ ఇస్తే మిల్లర్లు మొత్తం కొని ఎగుమతి చేయడానికి అవకాశం ఉందా?

తెలంగాణలో యాసంగిలో పండేదంతా ఎగుమతి చేయడం అయ్యేపని కాదు. ఒకప్పుడు పది నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తే ఇప్పుడు దీనికి ఆరేడు రెట్లు వస్తోంది. రాష్ట్రం నుంచి రెండు మిలియన్‌ టన్నుల బియ్యం ఎగుమతికి అవకాశం ఉంది. మిగిలిన రెండు మిలియన్‌ టన్నులు లేదా అంతకంటే ఎక్కువ బియ్యాన్ని కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాల్సిందే. లేదంటే ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం బియ్యం ఇచ్చి, నూకలు మిల్లర్లు అమ్ముకోవాలంటే వచ్చే నష్టాన్ని భరించడానికి క్వింటాలుకు కొంత మొత్తం ఛత్తీస్‌గఢ్‌ తరహాలో సబ్సిడీ ఇవ్వాలి. ఇది ఎంత మొత్తం? ఎలా ఇవ్వాలి? ఈ మొత్తం ఎవరు భరించాలన్నది ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో కూడా జాప్యం జరగకూడదు. ఈ వారంలోనే ధాన్యం మార్కెట్లోకి రావడం ప్రారంభమవుతుంది. ఆలస్యమైతే రైతు తక్కువ ధరకు అమ్ముకోవడం మొదలవుతుంది.

  • ఉప్పుడు బియ్యం కేంద్రం తీసుకొని ఎగుమతి చేయడానికి ఇబ్బంది ఏంటి?

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్ల్యూటీవో) నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆహారభద్రత కింద సేకరించే బియ్యాన్ని ఎగుమతి చేయడానికి వీలులేదు. కేంద్రం దేశంలో అవసరాల కోసం ఎంతైనా సేకరించవచ్చు.

  • సరాసరిన ఎంత బియ్యం.. ఎన్నిదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత?

ప్రపంచ వాణిజ్యంలో బియ్యం ఎగుమతి 45 మిలియన్‌ టన్నులు. ఇందులో మన దేశ వాటా 21 మిలియన్‌ టన్నులు (17 మిలియన్‌ టన్నుల బియ్యం, నాలుగు మిలియన్‌ టన్నుల బాస్మతి బియ్యం). అంటే ప్రపంచ బియ్యం ఎగుమతి మార్కెట్‌లో మన వాటా 46 శాతం. దీన్ని యాభైశాతానికి పెంచాలని కేంద్రం చెప్తోంది. తెలంగాణ నుంచి కూడా ఎగుమతికి మంచి అవకాశాలున్నాయి. సుమారు 120 దేశాలకు మనం ఎగుమతి చేస్తోన్నాం. ఇందులో దక్షిణాఫ్రికా దేశాలు, బంగ్లాదేశ్‌, వియత్నాం, సౌదీ అరేబియా, నేపాల్‌, మలేసియా ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు మన బియ్యం వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టుల నుంచి ఆరేడు లక్షల మిలియన్‌ టన్నులు వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్‌వే కాదు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వచ్చిన బియ్యం కూడా ఇందులో ఉన్నాయి.

ఇదీచూడండి: TRS protests: ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు.: కేంద్రంతో పోరులో తెరాస నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.