ETV Bharat / city

TDP Fires on YSRCP: కల్తీ సారా మరణాలకు అనారోగ్యాన్ని అంటగడుతున్నారు: తెదేపా

author img

By

Published : Mar 14, 2022, 1:11 PM IST

TDP fires on YSRCP: ఏపీలోని జంగారెడ్డిగూడెంలోని కల్తీ సారా మరణాలకు.. వైకాపా నేతలు అనారోగ్యాన్ని అంటగడుతున్నారని.. తెదేపా నేతలు మండిపడ్డారు. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన మద్యపాన నిషేధ హామీ ఏమైందని ప్రశ్నించారు.

TDP Fires on YSRCP: కల్తీ సారా మరణాలకు అనారోగ్యాన్ని అంటగడుతున్నారు: తెదేపా
TDP Fires on YSRCP: కల్తీ సారా మరణాలకు అనారోగ్యాన్ని అంటగడుతున్నారు: తెదేపా

TDP fires on YSRCP: వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన వైకాపా నేతలు.. ఇప్పుడు కల్తీ సారా మరణాలకు అనారోగ్యాన్ని అంటగడుతున్నారని.. ఏపీ తెదేపా నేతలు మండిపడ్డారు. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన మద్యపాన నిషేధ హామీ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు తెదేపా శాసనసభ సభ్యులు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. అసెంబ్లీకి వెళ్లారు. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి చనిపోయిన బాధిత కుటంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాల్ని సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని నేతలు దుయ్యబట్టారు. కల్తీసారా అరికట్టి.. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు.

ఇదీ చదవండి: గర్భం దాల్చిందని పెళ్లి.. అది వద్దన్నందుకు భార్యపై హత్యాయత్నం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.