ETV Bharat / business

ఆ ఉబర్ కార్యాలయం శాశ్వతంగా మూసివేత!

author img

By

Published : Jul 4, 2020, 10:59 AM IST

ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఉబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని సంస్థ కార్యాలయం శాశ్వతంగా మూసేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

uber close its office
ఉబర్ కార్యాలయం మూసివేత

కరోనాతో కుదేలైన ప్రముఖ ఆన్​లైన్ ట్యాక్సీ బుకింగ్ సేవల సంస్థ ఉబర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ముంబయిలోని సంస్థ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సంస్థ ఉద్యోగులకు ఈ ఏడాది డిసెంబర్​ వరకు వర్క్ ​ఫ్రం హోం ఇచ్చి ఈ నిర్ణయం తీసున్నట్లు సంస్థకు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఉబర్ కొత్త కార్యాలయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు.

ఇప్పటికే లాక్​డౌన్​లో తీవ్రంగా నష్టపోయిన ఉబర్​.. 600 మంది ఉద్యోగులను తొలగిస్తూ మేలో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల నుంచి తొలగించినప్పటికీ.. వారందరికి 10 వారాల జీతం, 6 నెలల వరకు వైద్య బీమా కవరేజీ, అవుట్ ప్లేస్​మెంట్ సపోర్ట్​ ఇస్తుందని వెల్లడించింది.

ఇదీ చూడండి:కరోనా లాక్​డౌన్​తో చిరుతిళ్లు చితికిపోయాయ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.