ETV Bharat / business

రతన్​ టాటాకు మాంచెస్టర్​​ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్

author img

By

Published : Feb 18, 2020, 6:39 AM IST

Updated : Mar 1, 2020, 4:42 PM IST

టాటా గ్రూప్​ అధినేత రతన్​ టాటాను గౌరవ డాక్టరేట్​తో సత్కరించింది బ్రిటన్​లోని యూనివర్సిటీ ఆఫ్​ మాంచెస్టర్​. వ్యాపారాల్లో, దాతృత్వంలో ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డు అందించినట్టు యూనివర్సిటీ పేర్కొంది.

DOCTORATE RATAN TATA
రతన్ టాటాకు గౌరవ డాక్టరేట్​

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూపు అధినేత రతన్​ టాటాకు మరో అరుదైన గౌరవం లభించింది. నవకల్పనకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన దాతృత్వ సేవలకుగాను బ్రిటన్​లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్​.. గౌరవ డాక్టరేట్​తో సత్కరించింది.

ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో టాటాకు ఈ ఆవార్డును ప్రదానం చేశారు. యూనివర్సిటీ అధ్యక్షురాలు, ఉపకులపతి ప్రొఫెసర్ డామీ నాన్సీ రోత్​వెల్​ భారత పర్యటనలో భాగంగా ఈ అవార్డును అందజేశారు.

రతన్ టాటా హయాంలో..

రతన్​ టాటా నేతృత్వంలో టాటా గ్రూపు.. 1991 నుంచి 2012 వరకు ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగిందని యూనివర్సిటీ కితాబిత్చింది. అంతర్జాతీయ బ్రాండ్లు అయిన టెట్లీ, డైవూ, కోరస్​, జాగ్వార్ ల్యాండ్​రోవర్​ వంటి సంస్థలను విలీనం చేసుకుని ప్రపంచలోని అతిపెద్ద కాంగ్లోమెరిట్ సంస్థల సరసన చేరిందని పేర్కొంది. టాటా సంస్థ ఈ స్థాయికి చేరడంలో రతన్​ టాటా కృషిని యూనివర్సిటీ ప్రశంసించింది.

ఇదీ చూడండి:మీకు తెలుసా... రతన్‌ టాటాకూ ఉందో లవ్‌స్టోరీ..!

Last Updated : Mar 1, 2020, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.