ETV Bharat / bharat

'టూల్​కిట్​'లో ఐఎస్ఐ, ఖలిస్థాన్ మద్దతుదారుడి హస్తం!

author img

By

Published : Feb 16, 2021, 5:24 PM IST

టూల్​కిట్ వ్యవహారంలో ఐఎస్ఐ, ఖలిస్థానీ మద్దతుదారుడు పీటర్ ఫ్రీడ్రిక్ హస్తం ఉన్నట్లు ఓ సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారతీయులు, భారత సంతతి వ్యక్తుల ప్రయోజనాలకు విరుద్ధంగా అతను పనిచేశాడని తెలిపింది. అయితే ఈ వార్తలను కొట్టిపారేసిన పీటర్.. ఇదంతా మోదీ సర్కార్ పనేనని ఆరోపించారు. మరోవైపు, ఖలిస్థానీ మద్దతుదారుడితో జూమ్ మీటింగ్​లో పాల్గొన్నట్లు నిఖితా జాకబ్ ఒప్పుకున్నారు.

Meet Pieter Friedrich, Greta's resource person with Khalistan, ISI links
'టూల్​కిట్​'లో ఐఎస్ఐ, ఖలిస్థాన్ మద్దతుదారుడి హస్తం!

పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్​బర్గ్ పోస్ట్ చేసిన 'టూల్​కిట్' కేసులో ఓ విదేశీయుడి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పీటర్ ఫ్రీడ్రిక్ అనే వ్యక్తి టూల్​కిట్​ వ్యవహారంలో రిసోర్స్ పర్సన్​గా ఉన్నట్లు డిస్​ఇన్ఫోల్యాబ్​ తన నివేదికలో వెల్లడించింది. 'భారత్​కు వ్యతిరేకంగా సమాచార యుద్ధం' పేరిట జరిగే ఓపెన్ సోర్స్ ఇన్వెస్టిగేషన్​లోనూ ఇతని పేరు కీలకంగా ఉందని తేలింది.

పీటర్​కు ఖలిస్థానీ సంస్థలతో పాటు, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని డిస్​ఇన్ఫోల్యాబ్ నివేదిక పేర్కొంది. 1990లో ఐఎస్ఐతో కలిసి భారత్​పై దాడి చేసే ప్రణాళికలతో అతడికి లింకులు ఉన్నాయని తెలిపింది. పాకిస్థాన్ అనుకూల ఖలిస్థానీ నెట్​వర్క్ ద్వారా భారతీయలు, భారతీయ అమెరికన్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేశారని వెల్లడించింది.

"మేం నెలరోజుల నుంచి 'ఇన్ఫో-వార్ అగెయినిస్ట్ ఇండియా'పై దృష్టిసారించాం. ఇందులో కీలకమైన ఒక వ్యక్తి పేరు థన్​బర్గ్ పొరపాటున పోస్ట్ చేసిన టూల్​కిట్​లోనూ కనిపించింది. ఆ విదేశీ నిపుణుడిని రిసోర్స్ పాయింట్​గా టూల్​కిట్​లో పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరు పీటర్ ఫ్రీడ్రిక్. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం."

-డిస్​ఇన్ఫోల్యాబ్

భారత్​లో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నిన ఖలిస్థాన్ మద్దతుదారుడు భజన్ సింగ్ భిందర్.. ఆర్థికంగా కుంగిపోయిన పీటర్ ఫ్రీడ్రిక్​తో జట్టుకట్టాడని డిస్​ఇన్పోల్యాబ్ పేర్కొంది. క్రిస్టియన్ మిషనరీగా ఉన్న పీటర్.. అప్పటి నుంచి గాంధీ వ్యతిరేక భావజాలంతో పనిచేశాడని తెలిపింది. ఫ్రీడ్రిక్​కు విశ్వసనీయత కల్పించేందుకు అమెరికాలో అనేక సంస్థలు ఏర్పాటైనట్లు వివరించింది. 2007లో నెలకొల్పిన ఆర్గనైజేషన్ ఫర్ ఇండియన్ మైనారిటీస్(ఓఎఫ్ఎంఐ) ఇందులో ప్రధానమైనదని వెల్లడించింది. భారత్​లోని మైనారిటీల కోసం ఏర్పాటైన ఈ సంస్థలో ఒక్క భారతీయుడు గానీ, భారత సంతతి మైనారిటీలు గానీ లేరని పేర్కొంది. సిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎస్ఐసీ) పేరుతో ఏర్పాటైన సంస్థలోనూ పీటర్​కు సముచిత స్థానం కల్పించారని తెలిపింది. ఇది ఖలిస్థానీ అజెండాలపై పనిచేస్తోందని వెల్లడించింది.

మోదీ ప్రభుత్వం సృష్టి: పీటర్

అయితే, తనపై వచ్చిన ఆరోపణలను పీటర్ ఫ్రీడ్రిక్ ఖండించారు. ఈ వ్యవహారం అంతా మోదీ ప్రభుత్వం కావాలనే సృష్టిస్తోందని ఆరోపించారు. ఆరెస్సెస్-భాజపా చేస్తున్న నేరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. అభూతకల్పన చేసి నేరాలన్నీ వాటిపై మోపుతున్నారని ట్వీట్ చేశారు.

Meet Pieter Friedrich, Greta's resource person with Khalistan, ISI links
పీటర్ ట్వీట్

"మోదీ యంత్రాంగం ప్రోత్సాహంతోనే ఖలిస్థాన్ ఉద్యమం కొనసాగుతోందని అనిపిస్తోంది. అభూతకల్పనలు సృష్టించి వాటిపై ఆరోపణలు చేయడానికి ఇలా చేస్తున్నట్లు ఉంది. ఆరెస్సెస్-భాజపా చేసే నేరాల నుంచి దృష్టి మళ్లించేందుకు మోదీ ప్రభుత్వం సైకలాజికల్ ఆపరేషన్(అనుకూలమైన సమాచారం మాత్రమే ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం) చేపడుతోంది. ప్రస్తుతం ఖలిస్థాన్ అనేది అంతకు మించిందేమీ కాదు."

-పీటర్ ఫ్రీడ్రిక్ ట్వీట్

'అవును.. జూమ్​లో పాల్గొన్నాం'

మరోవైపు, ఖలిస్థాన్ అనుకూల సంస్థ- 'పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్' స్థాపకుడు ఎంఓ ధలివాల్​తో జూమ్ మీటింగ్​లో పాల్గొన్నట్లు పర్యావరణ కార్యకర్త నిఖితా జాకబ్ తెలిపారు. దిశా రవి సహా మరికొందరు కార్యకర్తలు కూడా దీనికి హాజరైనట్లు చెప్పారు. ఈ కేసులో నిఖితతో పాటు మరొకరిపై నాన్​బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులకు తన న్యాయవాది ద్వారా ఓ డాక్యుమెంట్​ను పంపించిన జాకబ్.. ఎక్స్​టింక్షన్ రెబెలియన్(ఎక్స్ఆర్) అనే సంస్థ వలంటీర్లే టూల్​కిట్​ను రూపొందించారని పేర్కొన్నారు. ఇతర దేశాల పౌరులకు సులభంగా ఇక్కడి పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు దీన్ని తయారు చేసినట్లు వెల్లడించారు. అయితే గ్రెటాకు ఎలాంటి సమాచారాన్ని పంపలేదని అన్నారు. టూల్​కిట్ కేవలం సమాచారం కోసమేనని, హింసను రాజేసేందుకు కాదని స్పష్టం చేశారు. టూల్​కిట్​ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రయోజనాలు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోరారు జాకబ్.

దిశా రవి, గ్రెటా, నిఖితా జాకబ్

ఇవీ చదవండి:

మహిళా కమిషన్ నోటీసు

కాగా, 21 ఏళ్ల పర్యావరణ కార్యకర్త దిశా రవిని అరెస్టు చేయడంపై పోలీసులకు నోటీసు జారీ చేసింది దిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ). తాను ఎంపిక చేసుకున్న న్యాయవాది లేకుండానే దిశను కోర్టులో ఎందుకు హాజరుపర్చారని ప్రశ్నించింది. బెంగళూరు నుంచి దిశను అరెస్టు చేసిన తర్వాత ఆమె తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించలేదని పేర్కొంది. దిల్లీకి తీసుకొచ్చే ముందు ట్రాన్సిట్ రిమాండ్ కోసం బెంగళూరు కోర్టులో హాజరుపర్చలేదని తెలిపింది. ఈ మేరకు మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకొని నోటీసు పంపిన మహిళా కమిషన్.. దిశపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలతో పాటు తాము లేవనెత్తిన అంశాలపై నివేదిక అందించాలని దిల్లీ పోలీసులను కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.