ETV Bharat / bharat

'ఆర్థిక నేరస్థుల విషయంలో మా వైఖరి అదే'

author img

By

Published : Jun 3, 2021, 6:59 PM IST

విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం డొమినికా కస్టడీలో ఉన్న మెహుల్ ఛోక్సీని భారత్​కు అప్పగించే విషయమై న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. గాజా హింసపై మానవహక్కుల మండలిలో ఓటింగ్​కు భారత్ దూరంగా ఉండటంపై వివరణ ఇచ్చింది.

MEA on Mehul Choksi issue
'ఆర్థిక నేరస్థుల విషయంలో మా వైఖరి అదే'

దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయినవారిని భారత్ తిరిగి రప్పించాలన్న కృత నిశ్చయంతోనే ఉన్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మెహుల్ ఛోక్సీని భారత్​కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది.

"ప్రస్తుతం అతడు(ఛోక్సీ) డోమినికా కస్టడీలో ఉన్నారు. కొన్ని న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అతడిని భారత్​కు తీసుకొచ్చేలా ప్రయత్నాలు కొనసాగిస్తాం."

-అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి

గాజా హింసపై ఐరాస మానవ హక్కుల మండలిలో ఓటింగ్​కు భారత్ దూరంగా ఉండటాన్ని నిరసిస్తూ పాలస్తీనా విదేశాంగ మంత్రి లేఖ రాయడంపై బాగ్చికి ప్రశ్నలు సంధించారు పాత్రికేయులు. అయితే ఈ అంశంపై భారత్ వైఖరి కొత్తేం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా భారత్ ఇలాగే వ్యవహరించిందని చెప్పారు. ఓటింగ్​కు దూరంగా ఉన్న అన్ని దేశాలకూ పాలస్తీనా లేఖలు రాసిందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి- పాక్ వైఖరిపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.