ETV Bharat / bharat

'త్వరలోనే పదో విడత సైనిక చర్చలు!'

author img

By

Published : Jan 29, 2021, 5:39 AM IST

వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను అదుపులోకి తెచ్చేలా.. పదో విడత సైనిక చర్చలు జరిపేందుకు భారత్​-చైనా అంగీకరించుకున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. తొమ్మిదో విడత సమావేశంలోనే దీనిపై అవగాహనకు వచ్చినట్లు పేర్కొంది.

india-china-have-agreed-to-hold-10th-round-of-corps-commander-level-talks-soon-mea
'త్వరలోనే పదో విడత సైనిక చర్చలు!'

తూర్పు లద్దాఖ్​లో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా త్వరలోనే పదో విడత సైనిక చర్చలను నిర్వహించేందుకు భారత్-చైనా అంగీకరించాయని విదేశాంగ శాఖ తెలిపింది. దేశాధినేతల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం ఇరుపక్షాలు చర్చలు జరపాలని నిర్ణయించాయని పేర్కొంది.

ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించిన విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ... సైనిక చర్చలపై గతవారం జరిగిన కార్ప్స్​ కమాండర్ భేటీలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

జనవరి 24న భారత్-చైనా మధ్య 9వ విడత సైనిక కమాండర్ల భేటీ జరిగింది. తూర్పు లద్దాఖ్​లోని అన్ని ఘర్షణ ప్రాంతాల వద్ద బలగాల ఉపసంహరణపై విస్తృతంగా చర్చించారు ఇరుదేశాల సైనికాధికారులు. ఆచరణాత్మక, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని తమ సంయుక్త ప్రకటనలో భారత్-చైనా వెల్లడించాయి. ఈ చర్చల ద్వారా.. రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకం, అవగాహన పెరిగిందని పేర్కొన్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన ఫ్రంట్‌లైన్ బలగాలను వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.