ETV Bharat / bharat

అవినీతికి వ్యతిరేకంగా కూలీ 1300కి.మీ పాదయాత్ర.. కాళీమాత దర్శనం కోసం..

author img

By

Published : Jun 2, 2023, 11:14 AM IST

దేశంలో నిరుద్యోగం రూపుమాపి, అవినీతిని అరికట్టాలని పాదయాత్రకు పూనుకున్నాడు ఓ యువకుడు. భుజాలపై జాతీయ పతాకాన్ని మోస్తూ సుమారు 1300 కిలో మీటర్లు నడిచాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరంటే..

Daily Wage worker Padayathra
అవినీతికి వ్యతిరేకంగా కూలీ పాదయాత్ర

అవినీతికి వ్యతిరేకంగా కూలీ పాదయాత్ర

సాధారణంగా రాజకీయ నాయకులు తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పాదయాత్ర చేయడం సహజమే. కానీ ఓ యువకుడు సమాజంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, అవినీతిని అరికట్టాలనే సంకల్పంతో అడుగు ముందుకు వేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1300 కిలోమీటర్లు నడిచాడు. రెండు నెలల క్రితం ఉత్తర్ ప్రదేశ్​లోని తన స్వగ్రామం కరి నుంచి బయల్దేరిన సుదేశ్.. నేషనల్ హైవే మీదుగా దిల్లీ రాష్ట్రపతి భవన్​కు చేరుకొని ఆపై బంగాల్​కు నడుచుకుంటూ వెళ్లాడు.

ఉత్తర్​ప్రదేశ్​లోని ఇటావా జిల్లా కరి గ్రామానికి చెందిన సుదేశ్ కుమార్ ఓ రోజువారీ కూలి. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అవినీతి, నిరుద్యోగానికి వ్యతిరేకంగా అతడు నిరసన చేపట్టాడు. భుజాలపై జాతీయ జెండాను మోస్తూ.. ఇటావా నుంచి దిల్లీకి వెళ్లాడు. అక్కడి నుంచి బంగాల్​ వరకు దాదాపు 1300 కిలో మీటర్లు పాదయాత్ర చేశాడు. సుమారు రెండు నెలలుగా సాగిన సుదేశ్​ పాదయాత్ర.. గురువారం బంగాల్​లోని ఆసన్​సోల్ పట్టణానికి చేరుకుంది.

Daily Wage worker Padayathra
అవినీతికి వ్యతిరేకంగా కూలీ పాదయాత్ర

"నేను ఒక కార్మికుడ్ని. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయింది. ఉద్యోగాలు లేక తప్పు దారి పడుతున్న యువతను చూసి చాలా సార్లు బాధపడ్డాను. నా వంతుగా ఈ సమాజాన్ని మేల్కొల్పాలని రెండు నెలల కిందట ఈ పాదయాత్ర ప్రారంభించాను. జాతీయ రహదారి గుండా పాదయాత్ర చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగాను. దేశం పట్ల ప్రజలకు ఉన్న భక్తి గురించి తెలుసుకున్నాను. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉండనిచ్చేవారు కాదు. బహుశా నేను ఆ ప్రాంతానికి అపరిచితుడిని అని అలా చేశారని అనుకుంటా. అటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా జాతీయ జెండాను అగౌరపర్చలేదు. విశ్రాంతి లేకుండా నడిచాను. మొదట్లో నన్ను చాలా మంది నమ్మలేదు. ఆ తర్వాత నా గురించి, నా పాదయాత్ర గురించి అడగటం మొదలు పెట్టారు."
-సుదేశ్ కుమార్.

కాళీమాత దర్శనానికి..
దేశం నుంచి నిరుద్యోగం పూర్తిగా తొలగిపోవాలన్నది తన ఆశయమని యువకుడు చెబుతున్నాడు. భారత్ అవినీతి రహిత దేశంగా మారాలని అంటున్నాడు. బంగాల్​లోని దక్షిణేశ్వర్ వరకు అతడి పాదయాత్ర కొనసాగనుంది. దక్షిణేశ్వర్​కు చేరుకున్న తర్వాత అక్కడి కాళీమాత ఆలయాన్ని సందర్శిస్తానని యువకుడు చెబుతున్నాడు.

యోగాకు ప్రచారం.. మరో యువకుడి దేశవ్యాప్త పర్యటన..
యోగా ఒక జీవన విధానం. అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఒక మార్గం. భారత్​లో ఆవిర్భవించిన యోగా.. ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది. దాదాపు 180 దేశాలల్లో యోగా సాధన చేస్తున్నారు. ఇంతటి మహత్తరమైన యోగాను.. ప్రతి ఒక్కరు తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని ఓ యువకుడు.. వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాడు. యోగాతో పాటు పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు చెబుతున్నాడు. వాటి ప్రయోజనాలను వివరిస్తున్నాడు. పూర్తి కథనాన్ని చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.