ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​- జేసీబీలతో సమాధుల తవ్వకం

author img

By

Published : Apr 12, 2021, 8:34 PM IST

గుజరాత్​లోని సూరత్​లో కరోనా సోకి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో శ్మశాన వాటికల్లో మృత దేహాలను ఖననం చేసేందుకు జేసీబీల సాయంతో సమాధుల్ని తవ్వుతున్నారు. ఇప్పటికే అక్కడి మోరభాగల్​ శ్మశాన వాటికలో 25 సమాధుల్ని జేసీబీలతో తవ్వి సిద్ధం చేశారు

JCB machine to dig grave
కరోనా ప్రభావం- జేసీబీలతో సమాధుల తవ్వకం

ఏ శ్మశాన వాటికలోనైనా.. చనిపోయాక సమాధిని తవ్వుతారు. కరోనా మహమ్మారి ప్రభావంతో గుజరాత్​లోని సూరత్​లో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడ సమాధులను తవ్వేందుకు జేసీబీలను వినియోగిస్తున్నారు. మోరాభాగల్​ శ్మశాన వాటికలో​ ఇప్పటికే 25 సమాధులను జేసీబీల సాయంతో తవ్వి సిద్ధం చేశారు.

5 రెట్లు అధికంగా..

గుజరాత్​లో కరోనా వ్యాప్తి పెరుగుతుండగా.. కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సాధారణ రోజుల కంటే.. ప్రస్తుతం 5 రెట్లు అధికంగా శ్మశాన వాటికలకు మృతదేహాలు వస్తున్నాయి. కరోనా భయంతో సమాధుల్ని తవ్వేందుకు జనం ముందుకు రావటం లేదు. అంతేగాకుండా.. సమాధుల తవ్వకానికి గంటల తరబడి శ్మశానాల్లో వేచి ఉండాల్సి వస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా.. జేసీబీలను వినియోగిస్తున్నారు.

సూరత్​లో మూడు ప్రధాన శ్మశాన వాటికలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు రెండు లేదా మూడు మృతదేహాలు అక్కడకు వచ్చేవి. కానీ, ప్రస్తుతం ఆ సంఖ్య 8 నుంచి 10కి పెరిగిందని అంటున్నారు శ్మశాన నిర్వాహకులు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మృతదేహాలను తాము ఖననం చేస్తున్నామని వారు తెలిపారు.

ఇదీ చూడండి:రెస్టారెంట్​లో ఎస్సై దౌర్జన్యం- బదిలీ వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.