ETV Bharat / bharat

బ్లాక్​ ఫంగస్ అధ్యయనానికి నిపుణుల కమిటీ

author img

By

Published : May 24, 2021, 12:50 PM IST

బ్లాక్​ ఫంగస్​ వ్యాప్తికి గల కారణాలను అధ్యయనం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆక్సిజన్​ సరఫరా, పైపులు, సిలిండర్ల నాణ్యత.. తదితర అంశాలపై సోమవారం నుంచి కమిటీ అధ్యయనం చేయనుంది.

Black fungus
బ్లాక్​ ఫంగస్

కర్ణాటకలో వారం వ్యవధిలోనే 700 బ్లాక్​ ఫంగస్​ కేసులు నమోదైన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లాక్​ ఫంగస్ వ్యాప్తికి గల కారణాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

కర్ణాటక ఉపముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్​.. నిపుణుల కమిటీతో ఆదివారం సమావేశం నిర్వహించారు. బ్లాక్​ ఫంగస్​ వ్యాప్తికి గల కారణాలపై చర్చించారు. రాష్ట్రంలో గత వారం 700 బ్లాక్​ ఫంగస్​ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి చెందిన ఇతర దేశాల్లో బ్లాక్​ ఫంగస్ కేసులు లేవని.. కేవలం భారత్​లోనే నమోదయ్యాయన్నారు.

కలుషిత ఆక్సిజన్​ సరఫరా కూడా బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కారణం కావచ్చని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సంపత్​ చంద్ర ప్రసాద్ రావ్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : వలస కూలీల రిజిస్ట్రేషన్​పై సుప్రీం అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.