ETV Bharat / bharat

ఉరిశిక్ష మార్గదర్శకాల మార్పుపై పరిశీలనకు సుప్రీం సై

author img

By

Published : Jan 31, 2020, 4:00 PM IST

Updated : Feb 28, 2020, 4:16 PM IST

ఉరిశిక్ష అమలుపై బాధితులను, సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలు జారీ చేయాలనే కేంద్రం అభ్యర్థనను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2014లో ఇదే విషయానికి సంబంధించి కేసులో కక్షిదారుల స్పందన కోరింది.

Supreme accepted for consideration of modification of execution guidelines
ఉరిశిక్ష మార్గదర్శకాల మార్పుపై పరిశీలనకు సుప్రీం సై

ఉరిశిక్ష అమలు మార్గదర్శకాలను బాధితులు, సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించాలన్న కేంద్రప్రభుత్వ వ్యాజ్యాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నిర్భయ కేసు నిందితుల ఉరిశిక్ష అమలు ఆలస్యమయ్యేలా వరుస పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో.. ఈనెల 22న ఈ పిటిషన్​ వేసింది కేంద్రం.

ఉరిశిక్షకు సంబంధించి శత్రుఘ్న చౌహాన్​ కేసులో 2014లోనే మార్గదర్శకాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. అయితే నాటి మార్గదర్శకాలు దోషుల్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే రూపొందించారని, బాధితులను, సమాజాన్ని విస్మరించారని పిటిషన్​లో పేర్కొంది కేంద్రం. క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించిన తర్వాత ఏడు రోజుల్లోగా దోషులకు ఉరిశిక్షపడేలా.. ఒక వేళ వారు క్యురేటివ్​, రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినా అమలు తేదీకి మార్పు ఉండకుండా నూతన మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. 2014 నాటి శత్రుఘ్న చౌహాన్​ కేసుతో సంబంధమున్నవారికి తాఖీదులు ఇచ్చింది. కేంద్రం అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాలని సూచించింది.

ఇదీ చదవండి: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై కాసేపట్లో స్పష్టత!

Last Updated : Feb 28, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.