ETV Bharat / bharat

'నా కూతుర్ని ఎన్నోసార్లు చంపుకొన్నా'

author img

By

Published : Mar 21, 2020, 4:59 PM IST

ఆనాడు కూతురు ఫోన్‌ కోసం ఎదురు చూసింది.. అర్ధరాత్రి దాటే వరకూ రాలేదు. తర్వాత దాదాపు ఏడున్నరేళ్లు న్యాయం కోసం ఎదురు చూసింది.. తెల్లవారుతుండగా వచ్చింది. నిర్భయ తల్లి గెలిచింది. ఆశాదేవి ఆశ నెరవేరింది. తన కూతురుపై పాశవిక దాడి చేసిన క్రూరులు.. ఉరికొయ్యకు వేలాడారన్న విషయం తెలిసి.. ఏళ్లకేళ్లు కన్నీరొలికిన ఆ అమ్మ కళ్లలో ఆనందం కనిపించింది. చట్టంలో లొసుగులపై పిడికిళ్లు బిగించిన ఆమె చేతులు మళ్లీ ఇన్నాళ్లకు విజయ చిహ్నం చూపాయి. అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా.. అలుపెరగని దీక్షతో తన కూతురుకి నివాళి ఇచ్చిన నిర్భయ తల్లి పోరాట ప్రస్థానమిది.

nirbhaya concicts hanging
'నా కూతుర్ని ఎన్నోసార్లు చంపుకొన్నా'

2020, మార్చి 20. సమయం 6 గంటలు. తూరుపున సూర్యుడు నెత్తురుగడ్డలా ఉదయించాడు. 2012 డిసెంబరు 16న నిర్భయ శరీరం నుంచి చిందిన రక్తాన్ని పూసుకొన్నాడేమో అనుకున్నాం.

ఈ ఘటనలో దోషులను ఉరితీస్తే వారి శరీరంలో ఇంకిపోయిన రక్తాన్ని అద్దుకున్నాడని అర్థమైంది. ఒంటరిగా కన్పించే ఆడవాళ్లను వెంటాడే మృగాళ్లను చీకట్లతో పాటు వేటాడ్డానికి వచ్చాడని తెలిసింది. ఇక న్యాయం జరగదేమో అనుకుంటున్న తల్లుల మోములపై వెలుగులు నింపడానికి ఉదయించాడని అనిపించింది. అమ్మాయిలపై అక్కడాఇక్కడా చేతులేసే పక్కింటి అంకుళ్లపై కళ్లెర్రజేస్తూ.. యువతులను కాలేజీ రోడ్డులో ఏడిపించే ఆకతాయిలను హెచ్చరిస్తూ.. అబలలపై అత్యాచారాలకు దిగుదామనుకునే రౌడీమూకల గుండె చీలుస్తూ.. దిల్లీలో నిర్భయపై విరుచుకుపడిన తోడేళ్ల చావును ఉరికంభానికి వేలాడదీస్తూ... ఎర్రగా సూర్యుడు ఉదయించాడని తెలిసొచ్చింది.

అన్యాయానికి గురైన ఆడపడుచుల కన్నీళ్లు తుడుస్తూ.. న్యాయం కోసం పోరాడుతున్న అమ్మల ఆవేదన తీరుస్తూ.. క్రూరుల చేతుల్లో కుమిలిపోతున్న మహిళలకు ‘నిర్భయ’మిస్తూ..

ఆలస్యమైనా న్యాయం గెలుస్తుందన్న ఆశాదేవి... ఆశలకు అభయమిస్తూ... ఎర్రగా సూర్యుడు ఉదయించాడని తెలిసొచ్చింది.

నడిపించింది ఆ మాటలే

అమ్మా! అని నా కూతురు పిలిచినప్పుడల్లా గుండెల్లో నుంచి ఆనందం పొంగుకొచ్చేది. ఆనాడు.. ఆ కాళరాత్రి నాడు.. అదే పిలుపు. బాధతో పిలిచింది. బేలగా పిలిచింది. కన్నీటి తెరలు తుడుచుకొని తన వైపు చూశా! నా చిట్టితల్లి ఒంటినిండా రక్తమే! ఏదో క్రూరమృగం దాడి చేసిన లేడిలా కనిపించింది. గజగజ వణికిపోతూ.. ఏడ్వడానికి కూడా శక్తి లేకుండా.. మౌనంగా రోదిస్తూ.. నా వంక చూసింది. ఆ దృశ్యం ఇన్నేళ్లూ నన్ను నిద్రకు దూరం చేసింది. ఆఖరి క్షణాల్లో నా చేయి పట్టుకొని నా బంగారుతల్లి చెప్పిన మాటలు ఇన్నాళ్లూ నన్ను నడిపించాయి. వేదంలా వాటిని రోజూ పఠించా. ఆ మాటలే ఈ సాధారణ గృహిణిని.. యోధురాలిగా మార్చాయి. ఇప్పుడు నిర్భయ తల్లిగా యావత్‌దేశం గుర్తించిందంటే నా చిట్టితల్లి ఇచ్చిన ప్రోత్సాహమే! తనలా బలవుతున్న ఆడకూతుళ్ల కోసం ఓ చట్టమే తెచ్చేలా చేసింది. ఆ ప్రయత్నంలో తనే నన్ను ముందుండి నడిపించింది.

నరకం అనుభవించా..

కోర్టు గుమ్మం ఎక్కిన ప్రతిసారీ.. నా కూతురు మళ్లీ చచ్చిపోయిందనిపించేది. నేను జీవచ్ఛవంలా అయిపోయేదాన్ని. కోర్టులో ప్రతి నిమిషం నరక యాతన. కొందరు రాక్షసుల చేతిలో బలైన నా నిర్భయకు ఎలాగైనా న్యాయం చేయాలి. ఈ పోరాటంలో ఎన్ని ప్రశ్నలో! భరించరాని ప్రశ్నలు. సమాధానం చెప్పలేని ప్రశ్నలు. అడిగిందే అడిగే వాళ్లు. చెప్పిందే చెప్పేదాన్ని. నా కూతురు అనుభవించిన నరకాన్ని విడమర్చి చెప్పేదాన్ని. ఓ తల్లికి ఇంతకన్నా కష్టం ఏముంటుంది. వాదనలు ముగిశాక.. దుఃఖం కట్టలు తెంచుకునేది. భోరుమనేదాన్ని. గుండెలవిసేలా రోదించేదాన్ని. ఇంటికి వెళ్లాలనిపించేది కాదు. బయట ఉండాలనిపించేది కాదు. నా కూతురును ఇంకెన్నిసార్లు చంపాల్సి వస్తుందో అనే ఆలోచనే నన్ను కుంగదీసేది. మరణ యాతన అనుభవించేదాన్ని. ఒక్కోసారి న్యాయస్థానంపై నమ్మకం సడలిపోయేది. అప్పుడూ నా కూతురే నాకు అండగా నిలిచేది. పోరాటం ఆపొద్దని ప్రోత్సహించేది.

చివరి నిమిషం వరకూ..

ఏడున్నరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆ నలుగురికీ ఈ నెల 20న ఉరిశిక్ష పడింది. తీహార్‌ జైల్లో ఉరి అమలు చేయాలని న్యాయస్థానం తీర్పు. అది విన్న తర్వాత కూడా నా మనసులో ఆనందం కన్నా.. అనుమానాలే తలెత్తాయి. ఇలా ఎన్నోసార్లు జరిగింది. శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిందితులు చేయని ప్రయత్నం లేదు. ఏవేవో సాకులు చూపారు. వారి కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. అనుకున్నట్టుగానే ఎత్తుగడవేసి మరో పిటిషన్‌ వేశారు. గురువారమంతా సుప్రీంకోర్టు, హైకోర్టు, పాటియాలా కోర్టుల చుట్టూ తిరిగా. ‘ఈ తల్లి ఆవేదన అర్థం చేసుకోవా’ అని న్యాయదేవతను వేడుకున్నా. శిక్ష అమలుకు గంటన్నర ముందు వరకూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నా కన్నీటిని న్యాయదేవత తన మనసుతో చూసినట్టుంది. చివరకు కోర్టు తీర్పు వారిని ఉరికంబానికి వేలాడేలా చేసింది.

ఇదే స్ఫూర్తితో..

ఇన్నాళ్లూ నవ్వడమే మర్చిపోయిన నాకు, ఇప్పుడు ఆనందంగా ఉంది. కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. నిర్భయ ఆత్మకు ఇప్పుడు శాంతి లభిస్తుంది. పక్షం రోజులు కొన ఊపిరితో పోరాడిన నా బిడ్డను బతికించుకోలేకపోయా. ఆ బాధ మాత్రం జీవితాంతం వేదిస్తూనే ఉంటుంది. నా చిట్టితల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నానన్న సంతృప్తే మిగిలింది. ఇంతటితో ఈ మాతృవేదన ఆగిపోదు. నిర్భయ లాంటి ఆడకూతుళ్లు మనదేశంలో ఎందరో. వారందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తా. మీ కళ్ల ఎదుట ఆడకూతుళ్లపై అఘాయిత్యాలు జరిగితే.. వెంటనే స్పందించండి. బాధితులు బయటకు వచ్చి పోరాడాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. న్యాయస్థానంపై నమ్మకాన్ని ఉంచితే, నిందితులకు శిక్ష విధించేలా చేయొచ్చు.

గుండె పగిలిపోయంది

వాదనలు, ప్రతివాదనలు తర్వాత కొన్నాళ్లకు దోషులకు శిక్ష ఖరారైంది. న్యాయం జరిగిందన్న సంతోషం ఎంతోకాలం నిలవలేదు. నిందితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. శిక్ష వాయిదా పడింది. ఆ విషయం తెలియగానే.. నా కూతురు వెక్కివెక్కి ఏడుస్తున్నట్టు మనసుకు అనిపించింది. నేను అదే కోర్టు మెట్లపై నుంచి జరజర కిందికి జారిపోయినట్టు అనిపించింది. మళ్లీ పోరాటం, వాదనలు. గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నలు. వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పిన సమాధానాలు.. ఇంకా నా చెవిలో మార్మోగుతూనే ఉన్నాయి. కేసు వాయిదా పడ్డప్పుడల్లా గుండెలో గునపం దిగినట్టుండేది. అయినా వెనక్కి తగ్గలేదు. పోరాటం ఆపలేదు. మధ్యలో శిక్ష ఖరారయ్యేది.వారు కోరే క్షమాభిక్షలు నా మనసును ముక్కలు చేసేవి. మళ్లీ వాయిదాలు. పుండు మీద కారం చల్లినట్టు.. ‘నిందితులను క్షమించొచ్చు కదా!’ అనే ఓ మహిళా న్యాయవాది వేడుకోలు. ఆ మాట వినగానే గుండె పగిలింది. దానికి నేను సమ్మతించి ఉంటే నా కూతురుకు మళ్లీ అన్యాయం జరిగేది. నాలో గడ్డకట్టుకుపోయిన ఆవేదన నన్ను కఠినంగా మార్చేసింది. కన్నీళ్లు కట్టలు తెంచుకొని ప్రవహించినా.. గుండె తడి ఆరలేదు. మునపటి స్ఫూర్తితోనే పోరాటం కొనసాగించా. మరోసారి ‘నిందితులకు ఎలాగైనా ఉరిశిక్ష తప్పిస్తా..’ అంటూ సవాల్‌ విసిరాడు వారి తరఫు న్యాయవాది. నాలో కసిపెరిగింది. నాలుగు మెట్లు ఎక్కితే.. మూడు మెట్లు జారిపోయేదాన్ని. నా భావోద్వేగాలు, ఒత్తిడి, మానసిక వేదన.. వీటన్నిటికన్నా నిర్భయ వేదనే నన్ను తొలిచివేస్తుండేది. అయినా న్యాయం అడిగితే తప్పేంటి? ధర్మంగా పోరాడితే ఓటమి ఉండదనే విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేశాను. అనుక్షణం నా కళ్లల్లో మెదిలే కూతురే నన్ను లక్ష్యం వైపు నడిపించింది. నిందితులకు ఉరిశిక్ష పడాల్సిందేనని పట్టుదలతో ప్రయత్నించి గెలిచా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.