నిర్భయ కేసులో దోషులు దాఖలు చేసిన వ్యాజ్యంపై నేడు దిల్లీ కోర్టు విచారణ చేపట్టనుంది. క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. ఫలితంగా ఉరిని వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేశారు నిర్భయ దోషులు.
దోషుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ మంగళవారం రెండో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. మరో దోషి పవన్ గుప్తా సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇవి పెండింగ్‌లో ఉన్న కారణంగా ఉరిని వాయిదా వేయాలని దిల్లీ కోర్టులో మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం... తిహార్ జైలు అధికారులు సహా పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ముకేశ్‌కు చుక్కెదురు..
మరో వ్యాజ్యానికి సంబంధించి నిర్భయ దోషి ముకేష్‌కు చుక్కెదురైంది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను దిల్లీలో లేనన్న పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇదివరకే ట్రయల్ కోర్టు కొట్టేయగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు ముకేశ్.
ఇదీ చూడండి: నిర్భయ దోషికి షాక్... పిటిషన్‌ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు