ETV Bharat / bharat

చెత్తవ్యానులో మృతదేహం..  సర్కారుకు ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

author img

By

Published : Jun 12, 2020, 8:24 PM IST

Updated : Jun 12, 2020, 8:51 PM IST

ఓ మృతదేహాన్ని చెత్తవ్యానులో తరలించడంపై ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం, బలరాంపుర్ మున్సిపల్ కార్పొరేషన్​కు నోటీసులు జారీచేశాయి ఎన్​హెచ్​ఆర్సీ, రాష్ట్ర మైనారిటీ కమిషన్లు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించాయి.

up-nhrc
చెత్తవ్యానులో మృతదేహం.. యూపీ సర్కారుకు ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్​హెచ్​ఆర్సీ). పోలీసుల సమక్షంలోనే ఓ మృతదేహాన్ని చెత్తవ్యానులో తరలించడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన ఎన్​హెచ్​ఆర్సీ.. ఈ ఘటనకు పోలీసులు మౌన సాక్షులుగా నిలవడాన్ని ఆక్షేపించింది. ఈ ఘటన జరిగిన బలరాంపుర్ పాలనా యంత్రాంగానికి మైనారిటీ కమిషన్​ కూడా నోటీసులు ఇచ్చింది.

ఇదీ జరిగిందీ..

బలరాంపుర్ జిల్లా ఉత్రౌలా తహసీల్ కార్యాలయానికి వెళ్లిన అన్వర్ అలీ అనే వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనతో మృతదేహాన్ని చెత్త తీసుకెళ్లే వ్యానులో తరలించారు అక్కడి సిబ్బంది. ఈ ఘటనకు సంబంధించన వీడియో ఆధారంగా హెచ్​ఆర్సీ, రాష్ట్ర మైనారిటీ కమిషన్లు యూపీ ప్రభుత్వం, స్థానిక పాలనా యంత్రానికి నోటీసులు ఇచ్చాయి.

ఇదీ చూడండి: ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!

Last Updated : Jun 12, 2020, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.