ETV Bharat / bharat

ఓ వైపు శాంతి మంత్రం- మరోవైపు కుతంత్రం!

చైనా మరోమారు తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దులో శాంతిని కోరుకుంటున్నట్టు చెబుతూనే.. తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి 40,000మంది బలగాలను మోహరించింది. వీరికి భారీ స్థాయిలో ఆయుధాలు సమకూర్చినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను కూడా చైనా లెక్కచేయడం లేదు. సమస్యాత్మక ప్రాంతాల నుంచి తన సైన్యాన్ని చైనా ఉపసంహరించుకోవడం లేదని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు.

china-not-de-escalating-situation-on-lac-continues-to-deploy-40000-troops-on-ladakh-front
తీరు మార్చుకోని చైనా.. సరిహద్దులో భారీగా బలగాల మోహరింపు
author img

By

Published : Jul 23, 2020, 5:06 AM IST

Updated : Jul 23, 2020, 7:06 AM IST

సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో చైనా తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టింది. తూర్పు లద్ధాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో దాదాపు 40,000మంది బలగాలను మోహరించింది.

మరోవైపు భారత్​తో ఇప్పటివరకు జరిగిన మిలిటరీ, దౌత్య స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందాలను కూడా చైనా లెక్కచేయడం లేదు. సమస్యాత్మక ప్రాంతాల నుంచి తన బలగాలను చైనా ఉపసంహరించుకోకపోవడమే ఇందుకు కారణమని భారత సైన్యానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

"సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అదే సమయంలో తూర్పు లద్ధాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న లోతైన ప్రాంతాల్లో దాదాపు 40వేల బలగాలను మోహరించింది. ఈ బలగాలకు భారీ స్థాయిలో అయుధాలు సమకూర్చింది."

---- భారత సైన్యాధికారి.

ఇదీ చూడండి:- చైనా కొత్త కుట్ర- అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు నో!

గత వారం భారత్​-చైనా మధ్య కార్ప్​ కమాండర్ల స్థాయిలో జరిగిన భేటీ అనంతరం.. బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముందుకు కదలలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలాగే ఉన్నట్టు సైనిక అధికారి వెల్లడించారు.

ఫింగర్​ 5 ప్రాంతం నుంచి వైదొలిగేందుకు చైనా సముఖంగా లేదని సమాచారం. తమ శాశ్వత స్థానమైన సిరిజప్​కు వెనుదిరగకుండా.. అక్కడే ఉండి శిబిరాలను ఏర్పాటు చేసుకునే ఉద్దేశంలో చైనా ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా తూర్పు లద్ధాఖ్​లోని హాట్​ స్ప్రింగ్స్​, గోగ్రా ప్రాంతాల్లో చైనా ఆర్మీ నిర్మాణాలు చేపట్టినట్టు కనపడుతోంది.

ఇదీ జరిగింది...

ఈ ఏడాది మే నెల నుంచి సరిహద్దులో భారత్​పై చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ క్రమంలోనే గల్వాన్​ లోయలో భారత సైనికులపై చైనీయులు దుస్సాహసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులను అదుపుచేసేందుకు ఇరు దేశాలు అనేకమార్లు చర్చలు జరిపాయి. సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని అంగీరించాయి.

ఇవీ చూడండి:-

ఒప్పందాలను గౌరవించాల్సిందే.. చైనాకు భారత్ సందేశం

ఆ సముద్రం మీ సొత్తు కాదు: చైనాకు భారత్​ హెచ్చరిక

Last Updated : Jul 23, 2020, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.