పదేళ్ల సాయానికి పసిడి సైకిల్ గుర్తు బహుమతి - మనసును తాకిన అభిమానం - చంద్రబాబుకు బంగారు సైకిల్ కానుక
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 11:54 AM IST
Fan Gold Cycle Gift To Nara Chandrababu Naidu : కృష్ణా జిల్లా అనిగండ్లపాడుకి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి చంద్రబాబుకు చిరుకానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. 65 వేల రూపాయలు ఖర్చుపెట్టి బంగారంతో చేయించిన సైకిల్ గుర్తు నమూనాను చంద్రబాబుకు కానుకగా అందజేశాడు. తాను అనారోగ్యంగా ఉన్న సమయంలో చంద్రబాబు వ్యక్తిగతంగా చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు కృతజ్ఞతతోనే చంద్రబాబుకి చిరు కానుక ఇచ్చినట్టు తెలిపారు.
Gold Cycle Chain Gift To CBN : చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ వర్థంతి రోజు తాను చంద్రబాబును కలిశానన్నారు శ్రీనివాస్. పది సంవత్సరాల క్రితం తనకు యాక్సిడెంట్ అయ్యిందని ఆస్పత్రుల చుట్టూ శ్రస్త్ర చికిత్సకు 5నుంచి పది లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అంత డబ్బు లేక సహాయం కోసం చంద్రబాబును కలిశానన్నారు. ఆపరేషన్ గురించి బాబు వివరించగా ఉచితంగా చికిత్స చేయించారని శ్రీనివాస్ తెలిపారు. ఆ కారణంగానే అభిమానం బాబుకు బంగారపు సైకిల్ నమూనా బహుమతిగా ఇస్తున్నా అని శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశాడు.