గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలేనికి చెందిన ఓర్సు ప్రకాశ్ (37) ఉపగుత్తేదారు. చిలకలూరిపేట, అద్దంకి, ఒంగోలు, చేజర్ల, పులిచింతల తదితర ప్రాంతాల్లో ఉపాధి హామీ, ప్రభుత్వ పనులను.. ఓ ప్రధాన సంస్థకు చెందిన కాంట్రాక్టర్ నుంచి సబ్‌లీజ్‌కు తీసుకొన్నారు.
సుమారు రూ.2 కోట్లకు పైగా పనులు చేశారు. వీటిని పూర్తి చేయటానికి తెలిసినవారి వద్ద అప్పులు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తేనే డబ్బులిస్తానని ప్రధాన గుత్తేదారు స్పష్టం చేయడంతో.. ప్రకాశ్ తన పొలాన్ని, ఇళ్ల స్థలాల్ని అమ్మి కొందరి బాకీలు తీర్చారు. అయినప్పటికీ.. మరో రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అప్పులున్నాయట. ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు. చేసిన బాకీలు తీర్చమని అప్పుల వాళ్ల ఒత్తిడి పెంచారు.
దీంతో.. ప్రకాశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ వేదనతోనే అనారోగ్యం పాలై మంచం పట్టాడు. ఈ క్రమంలోనే.. ఈనెల ఆరో తేదీన మృతిచెందాడు. బిల్లులు రాకపోవడం వల్లనే తన భర్త ఆరోగ్యం దెబ్బతిని మృతి చెందారని ప్రకాశ్ భార్య ఆరోపించారు.
ఇదీ చూడండి: MAA elections 2021: 'మా' కొత్త అధ్యక్షుడు ఎవరు?