కొండాపురం మండల సమీపంలో కొర్రపాడు పునరావాస కాలనీవాసులు ఆందోళన నిర్వహించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరినా అధికారులు పట్టించుకోవటం లేదని నిరసన వ్యక్తం చేశారు. శవాన్ని రోడ్డుపై ఉంచి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్నారు.
ఇదీ చదవండి: బీటెక్ రవికి 14 రోజులు రిమాండ్.. కడప కేంద్ర కారాగారానికి తరలింపు..