Kadapa Development Meeting By Jana Chaitanya Vedika : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపపై ఐదేళ్లుగా ఎలాంటి దృష్టి సారించక పోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్ లో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులతోపాటు ప్రజాసంఘాలు మేధావులు హాజరయ్యారు.
రైతులకు మద్దతు.. జిల్లాలో ప్రజాసంఘాలు, విపక్షాల నిరసనలు
రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా పెట్టుబడులు తెలంగాణకి వెళ్లి పోతున్నాయని... ఏపీలో కంటే తెలంగాణలో భూముల ధరలు పెరుగుతున్నాయని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కు నాలుగు సార్లు శంకు స్థాపన జరుగుతున్న అడుగు ముందుకు పడడం లేదన్నారు. రాష్ట్రంలో మంత్రులు ఎవరో వారి శాఖలు ఏంటో ప్రజలకు తెలియడం లేదన్న లక్ష్మణ్ రెడ్డి... పాలకులు వ్యాపారస్తులయితే ప్రజలు బిక్షగాళ్లు గా మారుతారని గుర్తు చేశారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప రిమ్స్ వద్ద ఐటీ హబ్ కోసం భూములు కేటాయిస్తే వాటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకు దోచి పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య విమర్శించారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి నిరోధకలుగా మారిందో చర్చించడానికి తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణే లక్ష్యంగా ప్రతిజ్ఞ సభ
కడప జిల్లా అపారమైన ఖనిజ సంపదకు, పవిత్రమైన నదులకు, పుణ్యక్షేత్రాలకు నిలయమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని వనరులు జిల్లాలో ఉన్న... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం దృష్టి సారించకపోగా దోచుకోవడానికి ఎక్కువ శ్రద్ధ పెట్టారని తులసిరెడ్డి విమర్శించారు. నాలుగేళ్ల కిందట సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజోలి రిజర్వాయర్, కుందు- పెన్నా లిఫ్ట్ ఇరిగేషన్, జలదరాశి ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే నా చందంగా ఉన్నాయని ఆక్షేపించారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన కడప -బెంగుళూరు రైల్వే లైన్ వద్దని ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖలు రాయడం సిగ్గుచేటుగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కొత్తగా పులివెందుల, ముద్దనూరు, ముదిగుబ్బ మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి... పాతవాటి సంగతి మరిచారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ బుద్ధి చెబుతారని ఆయనకు పులివెందులలోనే గుణపాఠం నేర్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని ప్రజాసంఘం నాయకులు విమర్శించారు.
Tulasireddy Comments On Bjp: 'కడపలో ఉక్కు పరిశ్రమ సెగలు'.. కేంద్రంపై కాంగ్రెస్, ప్రజాసంఘాల ధ్వజం