కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు.. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా వాహనాల దొంగను అరెస్టు చేశారు. దొంగతోపాటు చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక పీఎస్లో మీడియా సమావేశం నిర్వహించారు.
'కర్నూలు జిల్లా సంజామల మండలం నోస్సం గ్రామానికి చెందిన జయరాజు.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో డబ్బు కోసం మోటార్ సైకిళ్ల దొంగతనాని పాల్పడేవాడు. ఇటీవల జరిగిన వరస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు ఏర్పాటు చేసిన నిఘాకు చోరీ చేస్తు చిక్కాడు. దీంతో జయరాజును అరెస్ట్ చేసి విచారించగా గతంలో చేసిన దొంగతనాల గురించి చెప్పాడు. నిందితుని వద్ద నుంచి 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నాం' అని డీఎస్పీ వివరంచారు.
ఇదీ చదవండి: