లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో భాజాపా ఎంపీ సీఎం రమేష్.. పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ప్రధానమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు, తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రెండు కోట్లు.. కడప జిల్లా కలెక్టర్కు రూ. 50 లక్షలను అందచేసినట్టు తెలిపారు. ఇంకా సహాయం కావలంటే అందిస్తానని చెప్పారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: