కేంద్రంలో భాజపా, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు వడ్డింపులు, వాయింపుల ప్రభుత్వాలుగా తయారయ్యాయని కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి విమర్శించారు. వేంపల్లిలో ఆటోకు తాడుకట్టి లాగుతూ.. నిరసన చేపట్టారు. కేంద్రం పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతుంటే.. వంట గ్యాస్ ధర పదో సెంచరీకి సమీపంలో ఉందన్నారు. జగన్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై విధించిన అదనపు వ్యాట్ ను తగ్గించాలని వారు కోరారు.
ఇవీ చూడండి:
కొవిడ్‌తో వృద్ధురాలు మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన పురపాలక సిబ్బంది