కడప జిల్లా ప్రొద్దుటూరులో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. హైదరాబాద్ బీహెచ్ఈఎల్కు చెందిన వారు... ఫిబ్రవరి నెలలో శుభకార్యానికి హాజరయ్యేందుకు ప్రొద్దుటూరు వచ్చారు. లాక్డౌన్ విధించటంతో తిరిగి వెళ్లలేకపోయారు. సుమారు 50 రోజులుగా ప్రొద్దుటూరులోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఆహారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని... వెంట చిన్నారి కూడా ఉండటంతో అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను హైదరాబాద్కు పంపేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి