పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం ఎస్సీ కాలనీకి వెళ్లే రహదారుల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సీఎస్ఐ దేవాలయం సమీపంలో ఉన్న రహదారిని కొందరు వ్యక్తులు ఇటీవల ఆక్రమించడం వల్ల సిమెంట్ రహదారి పనులను అధికారులు నిలిపివేశారు. దీని వల్ల కాలనీ వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి వెళ్లే రెండు వైపులా రహదారులు ఆక్రమించి కంచె నిర్మించడం వల్ల ద్విచక్ర వాహనాలు, పాఠశాల బస్సులు రావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వాపోయారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని.. ఇప్పటికైనా పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: