పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని టి.నరసాపురం మండలం వెలగపాడు గ్రామస్థులు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రామ వాలంటీర్ బొడ్డు వంశీ అనే వ్యక్తిపై సారా కేసు నమోదు చేశారని మాజీ సర్పంచ్ బొడ్డు శ్రీనివాస్ ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారులు న్యాయం చేయకపోతే వంశీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని తెలిపారు.
ధర్నాపై స్టేషన్ సీఐ స్పందిస్తూ జంగారెడ్డిగూడేనికి చెందిన ఇద్దరు వ్యక్తులు సారా తరలిస్తుండగా పట్టు పడ్డారని తెలిపారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంపై సారా సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. విచారణలో కాదని తేలితే కేసు తొలగిస్తామని సీఐ అజయ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...