పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ ప్రాంగణంలో డిసెంబర్ 24న నిర్వహించనున్న తొలి స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ రానున్నట్లు నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వీఐపీలకు ఇబ్బంది లేకుండా నాలుగు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారని.. వెల్లడించారు. 325 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు పొందుతారని నిట్ డైరెక్టర్ వివరించారు.
ఇదీ చదవండి: