పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసులు 2 టన్నుల బరువైన గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన లారీని సీజ్ చేశారు. సరుకు విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి హైదరాబాద్ కు ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించామని.. లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాక్ కింద గంజాయిని సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. డ్రైవర్, క్లీనర్ ను అరెస్ట్ చేసినట్టు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ జయరామరాజు వెల్లడించారు.
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7600 రూపాయల విలువ గల 34 మద్యం సీసాలను ద్విచక్ర వాహనంలో తరలిస్తుండగా పోలిసులు గుర్తించారు.
ఇదీ చదవండి:
నాపై వైకాపా నేతల హత్యాయత్నం.. కోర్టులో తేల్చుకుంటా: తెదేపా కార్యకర్త మణిరత్నం