భీమవరం ప్రజలకు నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు వరాల జల్లు కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే... పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పెరు పెడతానని హామీ ఇచ్చారు. భీమవరంలో ప్రజలు కోరిన చోట వంద అడుగుల అల్లూరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. భీమవరానికి ఎయిర్ పోర్ట్, ఐటీ పార్క్ తీసుకొస్తామన్నారు. డొక్కా సీతమ్మ పేరుమీద మహిళా క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భీమవరంలో తాగునీటి, డంపింగ్ యార్డ్ సమస్యలను పరష్కరించడానికి పటిష్ట ప్రణాళిక అమలు చేస్తామన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. విజ్జేశ్వరం నుంచి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని గ్రామాలకు పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. యనమదుర్రు డ్రైయిన్ కాలుష్యాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి
ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే.... అందరూ అడుగుతారు!