పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పంచాయతీ సిబ్బంది వీధి కుక్కలపట్ల దారుణంగా ప్రవర్తించారు. వీధి కుక్కలు గ్రామంలో లేకుండా చేయాలనే ఉద్ధేశంతో విషంపెట్టి చంపేశారు. సుమారు 400 శునకాలను చంపి డంపింగ్ యార్డ్లో పుడ్చి పెట్టారు. వీధి కుక్కలకు పంచాయతీ సిబ్బంది సైనేడ్ ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసినట్లు చల్లపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
పశుసంవర్ధక శాఖ అధికారులు చింతలపూడి డంపింగ్ యార్డ్ లో పూడ్చి పెట్టిన శునకాల మృతదేహాలకు సంబంధించిన శరీర భాగాలు సేకరించారు. చింతలపూడి పంచాయతీలో కుక్కల బెడద అధికంగా ఉందన్న కారణంతో సిబ్బంది వాటిని చంపేసినట్లు తెలుస్తోంది. జంతు సంరక్షణ చట్టం మేరకు వాటిని చంపడం చట్ట విరుద్ధం అంటూ చల్లపల్లి స్వచ్చంద సేవా సంస్థకు చెందిన శ్రీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ సిబ్బంది విషమిచ్చి చంపడం నిజమేనని అధికారుల విచారణలో వెల్లడైంది.
ఇది కూడా చదవండి.