పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉంటున్న వారికి కాకుండా... ఉద్యోగులు, సొంత ఇళ్లు ఉన్నవారికే ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కై, నేతలకు సంబంధించిన వారికే ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపించారు. అక్రమ ఇళ్ల స్థలాల పంపిణీ ఆపాలని.. అర్హులను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని నినాదాలు చేశారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన ఆపేందుకు ప్రయత్నించారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో గూమికూడవద్దని హెచ్చరించారు. అయినా గ్రామస్థులు ఆందోళనను విరమించలేదు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన ఎమ్మెల్యే