పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. తహసీల్దార్ దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్న తహసీల్దార్ దంపతులు.. ఇంటికే పరిమితమయ్యారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో దంపతులిద్దరికీ పాజిటివ్ గా తేలింది. దీంతో వీరిద్దరిని భీమవరం కొవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బందితో పాటు వీఆర్వోలు, ఇతర అధికారులకు కరోనా పరీక్షలు చేసేందుకు వైద్యాధికారులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ..